మాస్ మహారాజ్ 66 ఫిక్స్

దీపావళి సందర్భంగా మాస్ మహారాజ్ రవితేజ కొత్త సినిమా ప్రకటన వచ్చింది.. ‘డాన్ శీను’, ‘బలుపు’ సినిమాలు చేసిన గోపిచంద్ మలినేని, రవితేజతో హ్యాట్రిక్ హిట్‌కి రెడీ అయ్యాడు..

  • Published By: sekhar ,Published On : October 26, 2019 / 10:17 AM IST
మాస్ మహారాజ్ 66 ఫిక్స్

దీపావళి సందర్భంగా మాస్ మహారాజ్ రవితేజ కొత్త సినిమా ప్రకటన వచ్చింది.. ‘డాన్ శీను’, ‘బలుపు’ సినిమాలు చేసిన గోపిచంద్ మలినేని, రవితేజతో హ్యాట్రిక్ హిట్‌కి రెడీ అయ్యాడు..

దీపావళి సందర్భంగా మాస్ మహారాజ్ రవితేజ కొత్త సినిమా ప్రకటన వచ్చింది. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ ఓ సినిమా చేయనున్నాడు. హీరోగా రవికి ఇది 66వ సినిమా.. ఇంతకుముందు ‘డాన్ శీను’, ‘బలుపు’ సినిమాలు చేసిన గోపిచంద్ మలినేని రవితేజతో హ్యాట్రిక్ హిట్‌కి రెడీ అయ్యాడు.

‘డాన్ శీను’తోనే గోపిచంద్ దర్శకుడిగా పరిచయమయ్యాడు. కొంతగ్యాప్ తర్వాత వీళ్ల కాంబో తిరిగి తెరపైకి వస్తుంది. రవితేజను పవర్ ఫుల్ పోలీస్ క్యారెక్టర్‌లో చూపించనున్నాడు దర్శకుడు..

Read Also : నిఖిల్ సినిమా వస్తుందోచ్.. : ‘అర్జున్ సురవరం’ న్యూ రిలీజ్ డేట్

మాస్ మహారాజ్ ఇమేజ్ అండ్ బాడీ లాంగ్వేజ్‌కి తగ్గట్టు కథ రెడీ చేశారని తెలుస్తుంది. ఠాగూర్ మధు నిర్మించనున్న ఈ సినిమాను నవంబర్‌లో లాంఛనంగా ప్రారంభించనున్నారు. పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి.