Raviteja : ఎన్నో మైలు ప్రయాణంలో ఈ కొన్ని కిలోమీటర్లు ప్రత్యేకం.. రవితేజ అసిస్టెంట్ ఎమోషనల్ ట్వీట్..

మాస్ మహారాజ్ రవితేజ వరుస షూటింగ్ లతో బిజీగా ఉంటున్నాడు. ప్రస్తుతం ఈ హీరో నటిస్తున్న 'ధమాకా' సినిమా క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ 23న విడుదలకు సిద్దమవుతుంది. కాగా రవితేజ దగ్గర అసిస్టెంట్ గా చేస్తున్న శ్రీనివాసు రాజు...

Raviteja : ఎన్నో మైలు ప్రయాణంలో ఈ కొన్ని కిలోమీటర్లు ప్రత్యేకం.. రవితేజ అసిస్టెంట్ ఎమోషనల్ ట్వీట్..

Raviteja assistant emotional tweet

Raviteja : మాస్ మహారాజ్ రవితేజ వరుస షూటింగ్ లతో బిజీగా ఉంటున్నాడు. ఇటీవల ప్రముఖ ఛానల్ లో ప్రసారమయ్యే డాన్స్ షో ఫైనల్ కి గెస్ట్ గా హాజరయ్యి సందడి చేశాడు. ప్రస్తుతం ఈ హీరో నటిస్తున్న ‘ధమాకా’ సినిమా క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ 23న విడుదలకు సిద్దమవుతుంది. దీంతో చిత్ర యూనిట్ వరుసగా సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ఇస్తూ ప్రమోషన్స్ చేస్తుంది.

Raviteja: మాస్ రాజాతో మరోసారి రచ్చ చేసేందుకు రెడీ అంటోన్న డైరెక్టర్..?

కాగా రవితేజ దగ్గర అసిస్టెంట్ గా చేస్తున్న శ్రీనివాసు రాజు ఎమోషనల్ అవుతూ ట్వీట్ చేశాడు. శ్రీనివాస ఇటీవల సొంతంగా ఒక కారు కొనుక్కున్నాడు. ఈ క్రమంలో రవితేజ ఆ కారుని డ్రైవ్ చేస్తుండగా శ్రీనివాస పక్కన కూర్చొని మొదటి రైడ్ కి వెళ్ళాడు. ఆ దృశ్యాలను వీడియో తీసి పోస్ట్ చేస్తూ.. “ఊరులో సైకిల్ తొక్కడం నుండి సొంతంగా కారుని కొనుకోవడం వరకు, అంతా మీ వల్లే జరిగింది.

నేను మీతో చాలా మైళ్లు ప్రయాణించి ఉండవచ్చు కానీ మీరు నా కారును నడుపుతున్నప్పుడు మీ పక్కన కూర్చొని ప్రయాణించిన ఈ కొన్ని కిలోమీటర్లు ఎంతో ప్రత్యేకం. థాంక్యూ మాస్ గాడ్ రవితేజ” అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. కాగా గతంలో శ్రీనివాస్ ‘డాన్ శీను’ సినిమాలో కూడా నటించాడు.