Raviteja : 2022 చాలా కష్టంగా ఉంది.. ధమాకా సక్సెస్ ని వాళ్ళకి అంకితం చేస్తున్నాను..

తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా రవితేజ ఓ స్పెషల్ నోట్ ని ట్వీట్ చేశాడు. ఈ నోట్ లో.. నా ఫ్యాన్స్, వెల్ విషర్స్ అందరికి నా ధమాకా సినిమాని భారీ సక్సెస్ చేసినందుకు ధన్యవాదాలు. ధమాకా సక్సెస్ ని 2022 సంవత్సరంలో మనల్ని వదిలి వెళ్లిన........

Raviteja : 2022 చాలా కష్టంగా ఉంది.. ధమాకా సక్సెస్ ని వాళ్ళకి అంకితం చేస్తున్నాను..

Raviteja emotional note on Dhamaka Success

Raviteja :  మాస్ మహారాజ రవితేజ 2022లో ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ, ధమాకా సినిమాలతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ సినిమాలపై భారీ అంచనాలున్నా పరాజయం పాలయ్యాయి. సంవత్సరం చివర్లో వచ్చిన ధమాకా సినిమా మాత్రం థియేటర్స్ లో భారీ విజయం సాధించి రవితేజకి గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చింది. ఇప్పటికే ధమాకా సినిమా 75 కోట్లకి పైగా గ్రాస్ కలెక్షన్స్ ని వసూలు చేసి ఫుల్ ప్రాఫిట్ జోన్ లో ఉంది. ఇటీవలే ధమాకా సక్సెస్ మీట్ కూడా నిర్వహించారు చిత్ర యూనిట్.

తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా రవితేజ ఓ స్పెషల్ నోట్ ని ట్వీట్ చేశాడు. ఈ నోట్ లో.. నా ఫ్యాన్స్, వెల్ విషర్స్ అందరికి నా ధమాకా సినిమాని భారీ సక్సెస్ చేసినందుకు ధన్యవాదాలు. ధమాకా సక్సెస్ ని 2022 సంవత్సరంలో మనల్ని వదిలి వెళ్లిన లెజెండరీ యాక్టర్స్ కి అంకితమిస్తున్నాను. వారు లేని లోటు సినీ పరిశ్రమలో పూడ్చలేనిది. 2022 కొంచెం కష్టంగానే ఉన్నా మీ సపోర్ట్ తో ముందుకి వెళ్ళాం, ఎదిగాం. 2023లో కూడా మరింత ముందుకి మీ ప్రేమతో వెళ్లాలనుకుంటున్నాను అని తెలిపాడు.

NTR 30 : ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి న్యూ ఇయర్ గిఫ్ట్.. NTR 30 సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్..

దీంతో రవితేజ రాసిన ఈ నోట్ వైరల్ గా మారింది. అలాగే ధమాకా సినిమా సక్సెస్ ని ఈ సంవత్సరం మరణించిన తెలుగు సినీ పరిశ్రమ గ్రేట్ యాక్టర్స్ అందరికి అంకితమివ్వడంతో అభిమానులతో పాటు, పలువురు నెటిజన్స్ కూడా రవితేజని అభినందిస్తున్నారు. ఇక 2023లో రవితేజ రావణాసుర, టైగర్ నాగేశ్వరావు, వాల్తేరు వీరయ్య సినిమాలతో అలరించనున్నాడు.