Raviteja: మరో మల్టీస్టారర్ మూవీకి రవితేజ గ్రీన్ సిగ్నల్..? ఈసారి ఎవరితో అంటే..?

మాస్ రాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్ర ‘రావణాసుర’ వేసవి కానుకగా రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఇప్పుడు ఓ మల్టీస్టారర్ సినిమాకు రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. కలర్ ఫోటో వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన దర్శకుడు సందీప్ రాజ్ ఇటీవల రవితేజకు ఓ కథను వినిపించాడట.

Raviteja: మరో మల్టీస్టారర్ మూవీకి రవితేజ గ్రీన్ సిగ్నల్..? ఈసారి ఎవరితో అంటే..?

Raviteja Green Signal To Another Multistarrer

Raviteja: మాస్ రాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్ర ‘రావణాసుర’ వేసవి కానుకగా రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాలో రవితేజ పాత్ర పవర్‌ఫుల్‌గా ఉంటుందని.. ప్రేక్షకులు ఊహించని విధంగా ఆయన ఈ సినిమాలో పర్ఫార్మెన్స్ ఇవ్వనున్నారని చిత్ర యూనిట్ చెబుతోంది. ఇక ఈ సినిమా తరువాత ‘టైగర్ నాగేశ్వర్ రావు’ అనే సినిమాలో నటిస్తున్నాడు రవితేజ. అయితే ఇప్పుడు మరోసారి ఓ మల్టీస్టారర్ సినిమాకు రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

Raviteja : తమ్ముడి కొడుకుని లాంచ్ చేసిన రవితేజ.. పెళ్లి సందD డైరెక్టర్ తో..

కలర్ ఫోటో వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన దర్శకుడు సందీప్ రాజ్ ఇటీవల రవితేజకు ఓ కథను వినిపించాడట. ఇది ఒక మల్టీస్టారర్ సినిమా అని తెలుస్తోంది. అయితే, కథ విన్న రవితేజ ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమాలో మరో హీరోగా శర్వానంద్ నటించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాను సందీప్ రాజ్ పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్ కథతో తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నాడట.

Raviteja : వెంకటేష్ సూపర్ హిట్ సాంగ్ ని రీమిక్స్ చేసిన మాస్ మహారాజ..

ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ త్వరలోనే రాబోతుందని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో రవితేజ పాత్ర చాలా వైవిధ్యంగా ఉండబోతుందని.. ఈ సినిమాతో ఆయన కెరీర్‌లో మరో బ్లాక్‌బస్టర్ ఖాయమని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మరి నిజంగానే రవితేజ మరో మల్టీస్టారర్ మూవీతో మనముందుకు రాబోతున్నాడా అనేది చూడాలి.