Raviteja: ధమాకా.. మాస్ రాజా మళ్లీ వాయించేస్తాడట!

మాస్ రాజా రవితేజ నటిస్తున్న నెక్ట్స్ చిత్రాల్లో ‘ధమాకా’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. దర్శకుడు నక్కిన త్రినాథరావు తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రవితేజ తనదైన మార్క్ కామెడీతో మరోసారి ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.

Raviteja: ధమాకా.. మాస్ రాజా మళ్లీ వాయించేస్తాడట!
ad

Raviteja: మాస్ రాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ‘రామారావు ఆన్ డ్యూటీ’ భారీ అంచనాల మధ్య ఇటీవల రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో మాత్రం ఫెయిల్ అయ్యింది. దీంతో మాస్ రాజా మరో ఫ్లాప్‌ను తన ఖాతాలో మూటగట్టుకున్నాడు. ఇక ఈ ఫెయిల్యూర్‌తో సంబంధం లేకుండా మాస్ రాజా తన నెక్ట్స్ చిత్రాలపై ఫోకస్ పెట్టాడు. ఇప్పటికే ఈ క్రమంలో ఆయన నటిస్తున్న ధామాకా, టైగర్ నాగేశ్వర్ రావు, రావణాసుర వంటి సినిమాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి.

Dhamaka: మాస్ రాజా ధమాకా.. ప్రణవిగా శ్రీలీల!

అయితే ఈ సినిమాల్లో ధమాకా చిత్రానికి సంబంధించి ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ వర్గాల్లో మంచి అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. ఈ సినిమాను దర్శకుడు నక్కిన త్రినాధరావు తెరకెక్కిస్తుండగా, పూర్తి ఎంటర్‌టైనర్ మూవీగా ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఇండస్ట్రీ వర్గాల్లో ఓ వార్త జోరుగా చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో చాలా రోజుల తరువాత రవితేజ మార్క్ కామెడీ చూడబోతున్నట్లు చిత్ర యూనిట్ చెబుతోంది. రవితేజ ఇటీవల సీరియస్ పాత్రల్లోనే ఎక్కువగా కనిపిస్తుండటంతో, ఆయన కామెడీ టైమింగ్ చాలా మిస్ అవుతున్నారు అభిమానులు.

Dhamaka: మొదట పాయల్.. తర్వాత అనసూయ.. ఇప్పుడు ఈషా!

ధమాకా సినిమాతో ఈ లోటు తీరుతుందని చిత్ర యూనిట్ చెబుతోంది. ఇక ఈ సినిమాలో రవితేజ లుక్స్ పరంగా కూడా సరికొత్తగా కనిపిస్తుండటంతో ఈ సినిమాలో ఆయన పాత్ర, పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుందా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీలా హీరోయిన్‌గా నటిస్తోండటంతో, వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ ఎలా ఉంటుందా అనే ఆసక్తి కూడా అభిమానుల్లో నెలకొంది. కాగా, త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి ఓ అప్డేట్ ఉండబోతుందని చిత్రవర్గాల్లో టాక్ వినిపిస్తోంది.