Raviteja : రవితేజ పాన్ ఇండియా సినిమా

ఇదే ఊపులో 71వ సినిమా కూడా అనౌన్స్ చేసాడు మాస్ మహారాజ్. ఈ 71వ సినిమా పాన్ ఇండియా సినిమాగా ప్రకటించాడు. టాలీవుడ్ లో రవితేజకి మంచి మార్కెట్ ఉంది. ఇప్పుడు వేరే భాషల్లో మార్కెట్ కోసం

Raviteja : రవితేజ పాన్ ఇండియా సినిమా

Rt71

Raviteja :  ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమ పాన్ ఇండియా వైపు చూస్తుంది. స్టార్ హీరోల నుంచి యువ హీరోల వరకు అందరు తమ సినిమాలని పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు. వేరే భాషల్లో కూడా మార్కెట్ సంపాదించాలని ఆరాటపడుతున్నారు. తాజాగా మరో హీరో పాన్ ఇండియా సినిమా ప్రకటించాడు. తెలుగులో కస్టపడి పైకొచ్చిన హీరోల్లో రవితేజ ఒకరు. మాస్ మహారాజ్ గా తనకంటూ ఓ ఇమేజ్ ని తెచ్చుకున్నాడు. ఇటీవల ‘క్రాక్’ సినిమాతో భారీ విజయం సాధించాడు. దాని తర్వాత వరుసగా సినిమాలని అనౌన్స్ చేస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు రవితేజ.

Republic : ఓటీటీలో పరిస్థితి ఎలా ఉండబోతుంది?

వరుసగా రవితేజ 67వ సినిమా రమేష్ వర్మ దర్శకత్వంలో ‘ఖిలాడీ’, 68వ సినిమా త్రినాథరావు దర్శకత్వంలో ‘ధమాకా’, రవితేజ 69వ సినిమా శరత్ మండవ దర్శకత్వంలో ‘రామారావు ఆన్ డ్యూటీ’ ఇప్పటికే అనౌన్స్ చేశారు. 70వ సినిమా సుధీర్ వర్మ దర్శకత్వంలో కొత్తగా ప్లాన్ చేస్తున్నారు. ఇదే ఊపులో 71వ సినిమా కూడా అనౌన్స్ చేసాడు మాస్ మహారాజ్. ఈ 71వ సినిమా పాన్ ఇండియా సినిమాగా ప్రకటించాడు. టాలీవుడ్ లో రవితేజకి మంచి మార్కెట్ ఉంది. ఇప్పుడు వేరే భాషల్లో మార్కెట్ కోసం రవితేజ ట్రై చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే పాన్ ఇండియా సినిమాని అనౌన్స్ చేసాడు రవితేజ.

Ravi Teja 70 : ‘రావణాసుర’ గా రవితేజ

ఈ పాన్ ఇండియా సినిమాని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ నిర్మిస్తున్నారు. దర్శకుడిని ఇంకా అనౌన్స్ చేయలేదు. ఈ సినిమా గురించి మరిన్ని డీటెయిల్స్ ఇవాళ మధ్యాహ్నం ప్రకటించనున్నారు.