Ravanasura: రన్‌టైమ్ లాక్ చేసుకున్న రావణాసుర.. ఎంతో తెలుసా?

మాస్ రాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ‘రావణాసుర’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. ఈ సినిమా రన్‌టైమ్‌ను 2 గంటల 21 నిమిషాలుగా లాక్ చేసింది చిత్ర యూనిట్.

Ravanasura: రన్‌టైమ్ లాక్ చేసుకున్న రావణాసుర.. ఎంతో తెలుసా?

Raviteja Ravanasura Locks Runtime

Ravanasura: మాస్ రాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ‘రావణాసుర’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు సుధీర్ వర్మ డైరెక్ట్ చేస్తుండటంతో అభిమానుల్లో ఈ సినిమాపై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అయ్యాయి. ఇక ఈ చిత్ర టీజర్, ట్రైలర్స్ ఈ మూవీపై నెలకొన్న అంచనాలను రెట్టింపు చేశాయి. ఈ సినిమాలో రవితేజ పాత్ర సరికొత్తగా డిజైన్ చేయడంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు.

Raviteja : వెంకటేష్ సూపర్ హిట్ సాంగ్ ని రీమిక్స్ చేసిన మాస్ మహారాజ..

ఇక ఈ సినిమా అన్ని పనులను ముగించుకుని ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ క్రమంలోనే ఈ చిత్ర రన్‌టైమ్‌ను లాక్ చేశారు మేకర్స్. పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా రాబోతున్న రావణాసుర చిత్రానికి సెన్సార్ వారు A సర్టిఫికెట్‌ను జారీ చేయగా, ఈ సినిమా రన్‌టైమ్‌ను 2 గంటల 21 నిమిషాలుగా లాక్ చేసింది చిత్ర యూనిట్. ఓ కమర్షియల్ ఎంటర్‌టైనర్ మూవీకి ఇది రెగ్యులర్ రన్‌టైమ్. దీంతో ఈ సినిమాలో మాస్ రాజా పవర్‌ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుందా.. ఈ సినిమాలో ఆయన పాత్ర ఎలా ఉంటుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది.

Ravanasura Movie: రవితేజ ‘రావణాసుర’ మూవీకి ఎక్స్‌ట్రా షోలు.. ఎక్కడో తెలుసా..?

ఈ సినిమాలో అను ఇమ్మాన్యుయెల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నగార్కర్, పూజితా పొన్నాడ, రావు రమేష్, మురళీ శర్మ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, RT టీమ్ వర్క్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. మరి ఏప్రిల్ 7న రిలీజ్ కానున్న రావణాసుర బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.