Ravanasura Movie: రావణాసుర ఫస్ట్‌డే వరల్డ్‌వైడ్ కలెక్షన్స్.. ఎంతో తెలుసా?

మాస్ రాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ‘రావణాసుర’ తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.9 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది.

Ravanasura Movie: రావణాసుర ఫస్ట్‌డే వరల్డ్‌వైడ్ కలెక్షన్స్.. ఎంతో తెలుసా?

Raviteja Ravanasura Movie First Day Worldwide Collections

Ravanasura Movie: మాస్ రాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ‘రావణాసుర’ రిలీజ్‌కు ముందే మంచి అంచనాలు క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యింది. ఈ సినిమా నిన్న ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ మధ్య రిలీజ్ కాగా, ఈ సినిమాను చూసేందుకు మాస్ రాజా అభిమానులు ఆసక్తిని కనబరిచారు. అయితే ఈ సినిమా తొలి ఆటకే మిక్సిడ్ టాక్ తెచ్చుకున్నా, బాక్సాఫీస్ వద్ద మరే ఇతర పెద్ద సినిమా లేకపోవడంతో ఈ సినిమాకు మంచి ఆదరణ దక్కింది.

Ravanasura : రావణాసుర ట్విట్టర్ రివ్యూ.. అభిమానులు, ప్రేక్షకులు ఏమంటున్నారు?

రావణాసుర సినిమాలోని ట్విస్టులు ప్రేక్షకులను ఆకట్టుకున్నా, సినిమాలోని కథనం ప్రేక్షకులను ఇంప్రెస్ చేయడంలో కాస్త నెమ్మదించింది. ఇక ఈ సినిమాలో రవితేజ నెగెటివ్ షేడ్స్‌తో కనిపించడంతో ఈ సినిమాను చూసేందుకు అభిమానులు ఆసక్తిని చూపారు. ఈ సినిమాలో పలువురు హీరోయిన్లు నటించడంతో ఈ సినిమాలో వారి పాత్రలు ఎలా ఉంటాయా.. ఈ సినిమాలో రవితేజ చేసే యాక్షన్ ఎలా ఉందా అని అందరూ ఆసక్తిగా ఈ సినిమా కోసం చూస్తున్నారు. ఇక ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద తొలిరోజు మంచి వసూళ్లు దక్కాయి.

Ravanasura : రావణాసుర ప్రీ రిలీజ్ బిజినెస్.. ధమాకా కంటే తక్కువే.. మాస్ మహారాజ హ్యాట్రిక్ కొడతాడా?

ఈ సినిమాను చూసేందుకు ఆడియెన్స్ ఆసక్తిని చూపడంతో తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు ఏకంగా రూ.9 కోట్ల గ్రాస్ వసూళ్లు లభించాయి. వరుస హిట్లతో దూసుకెళ్తున్న రవితేజ సినిమాకు ఇది మంచి స్టార్ట్ అని చెప్పాలి. దర్శకుడు సుధీర్ వర్మపై కాన్ఫిడెన్స్ ఉన్న ఫ్యాన్స్ ఈ సినిమాను చూసేందుకు ఆసక్తిని చూపుతున్నారు. ఇక ఈ వీకెండ్ ముగిసే సరికి ఈ సినిమా కలెక్షన్లు మరింతగా పెరిగే అవకాశం ఉందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.