Ravanasura: ‘రావణాసుర’ నుండి వీడియో క్లిప్ లీక్.. నెట్టింట చక్కర్లు కొడుతున్న వివాదాస్పద డైలాగ్!

మాస్ రాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ‘రావణాసుర’లోని ఓ వీడియో క్లిప్ నెట్టింట ప్రత్యక్షమయ్యింది. వీడియో క్లిప్ నెట్‌లో ప్రత్యక్షం కావడంతో చిత్ర యూనిట్ ఆందోళన వ్యక్తం చేస్తోంది.

Ravanasura: ‘రావణాసుర’ నుండి వీడియో క్లిప్ లీక్.. నెట్టింట చక్కర్లు కొడుతున్న వివాదాస్పద డైలాగ్!

Raviteja Ravanasura Movie Video Clip Leaked

Ravanasura Movie: మాస్ రాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ‘రావణాసుర’ మరికొద్ది గంటల్లో థియేటర్లలో రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు సుధీర్ వర్మ డైరెక్ట్ చేయగా పూర్తి వైవిధ్యమైన కథతో ఈ సినిమా రాబోతుందని చిత్ర యూనిట్ ప్రమోట్ చేస్తోంది. ఇక ఈ సినిమాలో రవితేజ పాత్ర ఎవరూ ఊహించని విధంగా ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది. అయితే, రిలీజ్‌కు మరికొద్ది గంటలు మాత్రమే ఉండగా, రావణాసుర చిత్రానికి గట్టి షాక్ తగిలింది.

Also Read: Ravanasura : రావణాసుర ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్యాలరీ..

ఈ సినిమాలోని ఓ వీడియో క్లిప్ నెట్టింట ప్రత్యక్షమయ్యింది. రవితేజ ఓ పవర్‌ఫుల్ డైలాగ్ చెబుతున్న వీడియో క్లిప్ నెట్‌లో ప్రత్యక్షం కావడంతో చిత్ర యూనిట్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ వీడియో క్లిప్‌లో రవితేజ ఆడవారిని ఉద్దేశించి వివాదాస్పద డైలాగ్ చెప్పినట్లుగా తెలుస్తోంది. ఆడవారి పట్ల ఇలాంటి డైలాగ్ ఓ స్టార్ హీరో చెప్పడం ఏమిటని ఈ డైలాగ్ విన్నవారు మండిపడుతున్నారు. మరి ఈ లీక్ వీడియోపై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Also Read: Ravanasura Movie: రవితేజ ‘రావణాసుర’ మూవీకి ఎక్స్‌ట్రా షోలు.. ఎక్కడో తెలుసా..?

ఇక ఈ సినిమాలో రవితేజ లాయర్ పాత్రలో నటిస్తున్నట్లు ఇప్పటికే రిలీజ్ అయిన చిత్ర టీజర్, ట్రైలర్లు చూస్తే అర్థమవుతోంది. ఈ మూవీలో సుశాంత్, ఫరియా అబ్దుల్లా, మేఘ ఆకాష్, పూజితా పొన్నాడ, అను ఇమ్మాన్యుయెల్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. మరి ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందో తెలియాలంటే మరికొద్ది గంటలు వెయిట్ చేయాల్సిందే.