Ravanasura: రవితేజ ‘రావణాసుర’ టీజర్ టైమ్ లాక్

మాస్ రాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ‘రావణాసుర’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. రవితేజ రీసెంట్ మూవీ ‘ధమాకా’ బాక్సాఫీస్ వద్ద వంద కోట్ల వసూళ్లతో అదరగొట్టడంతో, ఆయన నెక్ట్స్ మూవీపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఇక ఈ సినిమా పోస్టర్స్ ఇప్పటికే నెలకొన్న అంచనాలను రెట్టింపు చేశాయి. అయితే ఇప్పుడు ఈ సినిమాపై మరిన్ని అంచనాలు క్రియేట్ చేసేందుకు చిత్ర టీజర్‌ను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.

Ravanasura: రవితేజ ‘రావణాసుర’ టీజర్ టైమ్ లాక్

Raviteja Ravanasura Teaser Release Time Locked

Ravanasura: మాస్ రాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ‘రావణాసుర’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. రవితేజ రీసెంట్ మూవీ ‘ధమాకా’ బాక్సాఫీస్ వద్ద వంద కోట్ల వసూళ్లతో అదరగొట్టడంతో, ఆయన నెక్ట్స్ మూవీపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఇక ఈ సినిమా పోస్టర్స్ ఇప్పటికే నెలకొన్న అంచనాలను రెట్టింపు చేశాయి. అయితే ఇప్పుడు ఈ సినిమాపై మరిన్ని అంచనాలు క్రియేట్ చేసేందుకు చిత్ర టీజర్‌ను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.

Ravanasura: టీజర్ డేట్‌ను లాక్ చేసిన రావణాసుర.. ఎప్పుడంటే?

రావణాసుర సినిమాలో రవితేజ సరికొత్త పాత్రలో నటిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమా టీజర్‌పై మంచి బజ్ క్రియేట్ కావడంతో, మార్చి 6న రిలీజ్ చేస్తున్నట్లు ఇటీవల చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. దీంతో మార్చి 6 కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా టీజర్‌పై చిత్ర యూనిట్ మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చింది. ఈ సినిమా టీజర్‌ను మార్చి 6న ఉదయం 10.08 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా పేర్కొంది.

Ravanasura : షూటింగ్ కంప్లీట్ చేసిన రావణాసుర..

ఈ సినిమాలో మేఘా ఆకాశ్, అను ఇమ్మాన్యుయెల్, ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్కర్, పూజిత పొన్నాడ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సుధీర్ వర్మ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకు హర్షవర్ధన్, భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందిస్తున్నారు. ఏప్రిల్ 7న రావణాసుర చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.