Raviteja : వెంకటేష్ సూపర్ హిట్ సాంగ్ ని రీమిక్స్ చేసిన మాస్ మహారాజ..

తాజాగా రావణాసుర సినిమా నుంచి వెయ్యిన్నొక్క జిల్లాల వరకు.. అనే లిరికల్ సాంగ్ ని రిలీజ్ చేశారు. అయితే ఈ సాంగ్ విక్టరీ వెంకటేష్ సాంగ్ ని రీమిక్స్ చేయడం విశేషం. వెంకటేష్, విజయశాంతి కలిసి నటించిన సూర్య IPS సినిమాలోని...............

Raviteja : వెంకటేష్ సూపర్ హిట్ సాంగ్ ని రీమిక్స్ చేసిన మాస్ మహారాజ..

Raviteja remix venkatesh old song in Ravanasura movie

Raviteja :  మాస్ మహారాజ రవితేజ ఇటీవల ధమాకా, వాల్తేరు వీరయ్య సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ కొట్టి ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. ప్రస్తుతం రవితేజ మరో రెండు సినిమాల్లో నటిస్తున్నాడు. రవితేజ త్వరలో రావణాసుర సినిమాతో రాబోతున్నాడు. సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రావణాసుర సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ లో ఉంది. ఏప్రిల్ 7న ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. ఈ సినిమాకి రవితేజ కూడా ఒక నిర్మాతగా వ్యవహరించడం విశేషం.

రావణాసుర సినిమాలో అను ఇమ్మానుయేల్‌, మేఘ ఆకాష్‌, ఫరియా అబ్దుల్లా, దక్షా నగార్కర్‌, పూజిత పొన్నాడ.. ఇలా అయిదుగురు హీరోయిన్స్ నటించడం విశేషం. ఇప్పటికే రిలీజయిన టీజర్, సాంగ్స్ తో ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో రవితేజ నెగిటివ్ షేడ్ లో కనపడనున్నాడని సమాచారం. తాజాగా రావణాసుర సినిమా నుంచి వెయ్యిన్నొక్క జిల్లాల వరకు.. అనే లిరికల్ సాంగ్ ని రిలీజ్ చేశారు.

Actress Laya : ఫ్యామిలీతో కలిసి తిరుమలలో సందడి చేసిన లయ..

అయితే ఈ సాంగ్ విక్టరీ వెంకటేష్ సాంగ్ ని రీమిక్స్ చేయడం విశేషం. వెంకటేష్, విజయశాంతి కలిసి నటించిన సూర్య IPS సినిమాలోని వెయ్యిన్నొక్క జిల్లాల వరకు.. అనే సాంగ్ ని తీసుకొని రీమిక్స్ చేసి అనురాగ్ కులకర్ణితో పాడించారు. లిరిక్స్ లో ఎలాంటి మార్పులు చేయలేదు. మధ్యలో కొంచెం ర్యాప్ లైన్స్ మాత్రం యాడ్ చేశారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించాడు.  సాంగ్ ని రెట్రో లుక్ తో రవితేజ, మేఘ ఆకాష్ మీద చిత్రీకరించారు. ఎప్పటిలాగే రవితేజ ఫుల్ యాక్టివ్ గా పెర్ఫార్మ్ చేశాడు. ఈ సినిమా కోసం రవితేజ అభిమానులు ఎదురు చూస్తున్నారు. రావణాసుర సినిమాతో కూడా హిట్ కొట్టి హ్యాట్రిక్ కొడతాడని భావిస్తున్నారు అభిమానులు.