Raviteja: మరో సినిమాకు రవితేజ పచ్చజెండా..?

మాస్ రాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రామారావు ఆన్ డ్యూటీ ఇప్పటికే చివరిదశకు చేరుకుని రిలీజ్‌కు రెడీ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పాటు ధమాకా...

Raviteja: మరో సినిమాకు రవితేజ పచ్చజెండా..?

Raviteja Signs One More Movie

Raviteja: మాస్ రాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రామారావు ఆన్ డ్యూటీ ఇప్పటికే చివరిదశకు చేరుకుని రిలీజ్‌కు రెడీ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పాటు ధమాకా అనే మరో సినిమాను కూడా తెరకెక్కిస్తున్నాడు ఈ మాస్ హీరో. అయితే ఈ సినిమాలతో పాటు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఓ సినిమాలో కీలక పాత్రలో నటించేందుకు రెడీ అవుతున్నాడు మాస్ రాజా.

Raviteja: రవితేజ పాత్ర అలా ఉండబోతుందా?

అయితే తాజాగా మరో కొత్త సినిమాకు కూడా రవితేజ పచ్చజెండా ఊపినట్లుగా తెలుస్తోంది. సూర్య వర్సెస్ సూర్య అనే సినిమాతో దర్శకుడిగా మారిన ప్రముఖ సినిమాటోగ్రఫర్ కార్తీక్ ఘట్టమనేని రవితేజకు ఓ కథను వినిపించాడట. దీనికి రవితేజ ఓకే చెప్పడంతో త్వరలోనే ఈ ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా పట్టాలెక్కనున్నట్లు చిత్రపురిలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమా కథను ఇంకా పూర్తిగా డెవలప్ చేయాలని రవితేజ సూచించాడట.

Raviteja: చిరు సినిమాలో రవితేజ పాత్ర అలా ఉంటుందా..?

మొత్తానికి రవితేజ వరుసబెట్టి సినిమాలను తెరకెక్కిస్తూ బిజీగా మారడమే కాకుండా, పాత-కొత్త అనే తేడాలేకుండా డైరెక్టర్లకు అవకాశాలు ఇస్తూ దూసుకుపోతున్నాడు. మరి కార్తీక్ ఘట్టమనేని చెప్పిన కథ రవితేజకు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి అంటున్నారు మాస్ రాజా అభిమానులు.