Raviteja : ప్రొడ్యూసర్ గా నాకు ఈ సినిమా హిట్ అవ్వాలి.. పది సినిమాలు చేయాలనుకున్నాం..

రావణాసుర సినిమా ఏప్రిల్ 7న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాకి అభిషేక్ నామాతో పాటు రవితేజ కూడా నిర్మాతగా వ్యవహరించారు. తాజాగా రావణాసుర సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది.

Raviteja : ప్రొడ్యూసర్ గా నాకు ఈ సినిమా హిట్ అవ్వాలి.. పది సినిమాలు చేయాలనుకున్నాం..

Raviteja Speech in Ravanasura Pre Release Event

Raviteja :  రవితేజ(Raviteja) హీరోగా సుధీర్ వర్మ(Sudheer Varma) దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా రావణాసుర(Ravanasura). ఈ సినిమాలో అను ఇమ్మాన్యుయేల్, ఫరియా అబ్దుల్లా, దక్ష నగర్కర్, మేఘ ఆకాష్, పూజిత పొన్నాడ.. ఇలా అయిదుగురు హీరోయిన్స్ నటించడం విశేషం. హీరో సుశాంత్(Sushanth) ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమాలో రవితేజ నెగిటివ్స్ షేడ్స్ లో కనిపించబోతున్నట్టు సమాచారం. ఇప్పటికే రిలీజయిన టీజర్, ట్రైలర్స్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రావణాసుర సినిమా ఏప్రిల్ 7న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాకి అభిషేక్ నామాతో పాటు రవితేజ కూడా నిర్మాతగా వ్యవహరించారు.

Pujita Ponnada : రావణాసుర ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చీరలో సందడి చేసిన పూజిత పొన్నాడ

తాజాగా రావణాసుర సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ లో రవితేజ మాట్లాడుతూ.. నా ఎనర్జీ, నా ఉత్సాహం, నా ప్రోత్సాహం.. తమ్ముళ్లు మీరే. ఈ సినిమా ఆర్ట్ డైరెక్టర్ తో ఫస్ట్ టైం చేశాను. మా డైరెక్టర్ తో బాగా సింక్ లో ఉండి పనిచేశాడు. మాములుగా యాక్టర్స్ స్పెషల్ అప్పీరెన్స్ ఇస్తారు సినిమాల్లో. ఈ సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ స్పెషల్ అప్పీరెన్స్. నా భీమ్స్ స్పెషల్ గా ఒక సాంగ్ చేశాడు. ఈ సినిమాలో సౌండ్ ఎక్సలెంట్ గా ఉంటుంది. మీరంతా బాగా ఎంజాయ్ చేస్తారు థియేటర్లో. మ్యూజిక్ డైరెక్టర్ అంతబాగా ఇచ్చాడు. ఈ సినిమా వాళ్ళ ఒక మంచి టెక్నీషియన్ ని కలిశాను. ఈ సినిమాకి పనిచేసిన రైటర్ శ్రీకాంత్ పుష్ప 2కి కూడా పనిచేస్తున్నాడు. ఫ్యూచర్ లో మరిన్ని సినిమాలు ఇతనితో చేస్తున్నాను. హైపర్ ఆదితో నా కాంబో అందరికి నచ్చుతుంది. మళ్ళీ మళ్ళీ కావాలని కోరుకుంటారు. ఈ సినిమా నాకు బాగా నచ్చింది. మీ అందరికి నచ్చుతుంది. కచ్చితంగా థియేటర్స్ లో విజిల్స్ పడతాయి. ఈ సినిమా టైటిల్స్, పోస్టర్స్ అన్ని డిజైన్ చేసింది ఈ సినిమా నిర్మాత అభిషేక్ నామా. ఈ సినిమా హిట్ అయి ప్రొడ్యూసర్స్ గా నాకు, అభిషేక్ కి మంచి పేరు రావాలి. మేమిద్దరం కలిసి భవిష్యత్తులో మరిన్ని సినిమాలు చేస్తాము. కనీసం పది సినిమాలైనా కలిసి చేయాలనుకున్నాం. సుశాంత్ చాలా సాఫ్ట్, అతను బయటకు రావాలి. ఈ సినిమాతో కొత్త సుశాంత్ చూస్తారు. ఈ సినిమా హిట్ తో డైరెక్టర్ నెక్ట్ లెవెల్ కి వెళ్తాడు. ఏప్రిల్ 7న థియేటర్స్ దద్దరిల్లిపోతాయి. జై సినిమా అని అన్నాడు.