Raviteja: నిర్మాతగా కూడా గ్యాప్ ఇవ్వనంటోన్న మాస్ రాజా..!

మాస్ రాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ‘ధమాకా’ రేపు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను త్రినాథరావు నక్కిన తెరకెక్కించగా ఔట్ అండ్ ఔట్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా ఈ సినిమా రానుంది. ఇక ఈ సినిమాలో రవితేజ డ్యుయెల్ రోల్ చేస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి.

Raviteja: నిర్మాతగా కూడా గ్యాప్ ఇవ్వనంటోన్న మాస్ రాజా..!

Raviteja To Get Busy In Producing Films

Raviteja: మాస్ రాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ‘ధమాకా’ రేపు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను త్రినాథరావు నక్కిన తెరకెక్కించగా ఔట్ అండ్ ఔట్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా ఈ సినిమా రానుంది. ఇక ఈ సినిమాలో రవితేజ డ్యుయెల్ రోల్ చేస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి.

Raviteja: తన ఫేవరెట్ డైరెక్టర్స్‌తో రవితేజ ధమాకా ఇంటర్వ్యూ..!

ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర పోస్టర్స్, సాంగ్స్, టీజర్, ట్రైలర్లు ఈ సినిమాపై అంచనాలు అమాంతం పెంచేశాయి. అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌లో రవితేజ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలోనే ఆయన ఓ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. తాను యాక్టర్‌గానే కాకుండా నిర్మాతగా కూడా బిజీగా మారేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపాడు. తన హోమ్ బ్యానర్ RT వర్క్స్‌లో ఇప్పటికే పలు సినిమాలను ప్రొడ్యూస్ చేయగా, ఇకపై మరిన్ని సినిమాలు తన బ్యానర్ నుండి రాబోతున్నట్లు తెలిపాడు.

Raviteja: మీరే చూస్తారు కదా.. అంటూ ‘ధమాకా’పై రవితేజ కాన్ఫిడెంట్!

ఇప్పటికే పలు సినిమాలను తాను లైన్‌లో పెట్టానని.. త్వరలోనే వాటికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడిస్తానని రవితేజ ఈ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఇక ప్రస్తుతం ధమాకా సినిమాతో పాటు ఆయన తన నెక్ట్స్ చిత్రాలు ‘టైగర్ నాగేశ్వరరావు’, ‘రావణాసుర’లను కూడా సిద్ధం చేస్తున్నాడు. ఈ సినిమాలతో పాటు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘వాల్తేరు వీరయ్య’లోనూ మాస్ రాజా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు.