Mega154: వాల్తేర్ వీరయ్య కోసం రామారావు డ్యూటీ ఎక్కుతున్నాడా..?

మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’ బాక్సాఫీస్ వద్ద భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యి ఫ్లాప్ దిశగా వెళ్తుండటంతో, చిరంజీవి ఆచార్య చిత్ర రిజల్ట్ నుండి బయటపడేందుకు....

Mega154: వాల్తేర్ వీరయ్య కోసం రామారావు డ్యూటీ ఎక్కుతున్నాడా..?

Raviteja To Join Sets Of Chiranjeevi Mega154 Movie

Mega154: మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’ బాక్సాఫీస్ వద్ద భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యి ఫ్లాప్ దిశగా వెళ్తుండటంతో, చిరంజీవి ఆచార్య చిత్ర రిజల్ట్ నుండి బయటపడేందుకు ఆయన సతీమణితో కలిసి ఫారిన్ వెకేషన్‌కు వెళ్లారు. ఇక ఇదిలా ఉంటే, ఆయన తన నెక్ట్స్ చిత్రాలపై పూర్తిగా ఫోకస్ పెట్టి, ఈసారి ఎలాంటి పొరపాట్లు జరగకుండా ఉండేలా జాగ్రత్త పడనున్నట్లు చిత్ర వర్గాలు అంటున్నాయి. ఈ క్రమంలోనే ఆయన నటిస్తున్న గాడ్‌ఫాదర్, భోళాశంకర్ మరియు మెగా154 ప్రాజెక్టులకు సంబంధించి అన్ని పనులు కూడా జాగ్రత్తగా జరిగేలా చూసుకుంటున్నాడు.

Mega154: చిరు లీక్స్.. వాల్తేరు వీరయ్య కన్ఫం!

అయితే ఇటీవల మెగా 154 ప్రాజెక్టుకు సంబంధించి ఓ వార్త ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా షికారు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో మాస్ రాజా రవితేజ నటిస్తున్నాడని గతంలోనే చిత్ర యూనిట్ తెలిపింది. కానీ తాజాగా ఆయన ఈ సినిమా నుండి పక్కకు తప్పుకున్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు అవన్నీ కూడా కేవలం పుకార్లేనని తేలిపోయింది. నిజానికి మెగా154 ప్రాజెక్టులో తన పాత్రకు సంబంధించిన షూటింగ్‌ను మొదలుపెట్టేందుకు మాస్ రాజా రెడీ కూడా అవుతున్నాడట.

Mega154: చిరుతో మాస్ రాజా హైస్పీడ్ షూటింగ్!

మెగా 154 ప్రాజెక్టులో తన పాత్రకు సంబంధించిన షూటింగ్‌ను జూన్ నెలలో జరిపేందుకు రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. జూన్ మొదటి వారంలో చిత్ర యూనిట్ రవితేజ, చిరంజీవిలపై కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లో వేసిన ఓ సెట్‌లో వీరిద్దరిపై సీన్స్ షూట్ చేస్తారట. ఇక ఈ సినిమాలో మెగాస్టార్ సరసన అందాల భామ శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఈ సినిమాకు ‘వాల్తేర్ వీరయ్య’ అనే టైటిల్ పెట్టబోతున్నట్లు చిరు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.