Raviteja: ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసులో సందడి చేసిన రవితేజ

‘రావణాసుర’ మూవీతో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చాడు మాస్ రాజా రవితేజ. తాజాగా తాను కొన్న కొత్త కారు రిజిస్ట్రేషన్ కోసం ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసుకు వెళ్లాడు ఈ మాస్ హీరో.

Raviteja: ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసులో సందడి చేసిన రవితేజ

Raviteja Visits Khairtabad RTA Office

Raviteja: మాస్ రాజా రవితేజ నటించిన రీసెంట్ మూవీ ‘రావణాసుర’ ఇటీవలీ రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద యావరేజ్ మూవీగా నిలిచింది. ఈ సినిమాను దర్శకుడు సుధీర్ వర్మ తెరకెక్కించగా, నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో రవితేజ తనదైన పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇక ప్రస్తుతం తన నెక్ట్స్ ప్రాజెక్టులను వరుసగా తెరకెక్కిస్తూ బిజీగా ఉన్నాడు ఈ స్టార్ హీరో.

Raviteja : బాలీవుడ్‌లో రవితేజ మల్టీస్టారర్.. నిజమేనా?

అయితే, తాజాగా ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసులో రవితేజ సందడి చేశాడు. ఇటీవల రవితేజ ఓ కొత్త ఎలక్ట్రిక్ కారును కొన్నాడు. ఈ వాహనం రెజిస్ట్రేషన్ కోసం ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసుకు రవితేజ వెళ్లాడు. ఈ ఎలక్ట్రిక్ కారును దాదాపు రూ.34.5 లక్షలతో కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. అంతేగాక ఈ వాహనానికి టీఎస్‌09 జీబీ2628 అనే ఫ్యాన్సీ నంబర్‌ను ఏకంగా 17,628 రూపాయలకు వేలంలో సొంతం చేసుకున్నాడట ఈ మాస్ హీరో. తన ఎలక్ట్రిక్ కారు రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన రవితేజ సరికొత్త లుక్‌లో కనిపించాడు.

Raviteja : బాలీవుడ్ యువ హీరోతో రవితేజ మల్టీస్టారర్? తెలుగు డైరెక్టర్ తో సినిమా..

ఇక రవితేజ ఆర్టీఏ ఆఫీసుకు రావడంతో, ఆయన్ను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. తన వాహన రిజిస్ట్రేషన్ పనులు ముగించుకుని రవితేజ అక్కడి నుండి వెళ్లిపోయాడు. కాగా, రవితేజ ప్రస్తుతం టైగర్ నాగేశ్వర్ రావు అనే పీరియాడిక్ పాన్ ఇండియా మూవీలో నటిస్తున్నాడు.