రాయలసీమ లవ్ స్టోరీ – రివ్యూ

వెంకట్, పావని, హృశాలి హీరో, హీరోయిన్లుగా.. రామ్ రణధీర్‌ని దర్శకుడిగా పరిచయం చేస్తూ పంచలింగాల బ్రదర్స్ నిర్మించిన 'రాయలసీమ లవ్ స్టొరీ' మూవీ రివ్యూ.. 

  • Published By: sekhar ,Published On : September 27, 2019 / 11:33 AM IST
రాయలసీమ లవ్ స్టోరీ – రివ్యూ

వెంకట్, పావని, హృశాలి హీరో, హీరోయిన్లుగా.. రామ్ రణధీర్‌ని దర్శకుడిగా పరిచయం చేస్తూ పంచలింగాల బ్రదర్స్ నిర్మించిన ‘రాయలసీమ లవ్ స్టొరీ’ మూవీ రివ్యూ.. 

రామ్ రణధీర్‌ని దర్శకుడిగా పరిచయం చేస్తూ పంచలింగాల బ్రదర్స్ నిర్మించిన చిత్రం ‘రాయలసీమ లవ్ స్టొరీ’. సినిమా విడుదలకు ముందు టైటిల్ పట్ల వివాదం చెలరేగింది.. అయినప్పటికీ అన్ని అడ్డంకులను అధిగమించి ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిందీ చిత్రం.. ప్రేక్షకులను అలరించేలా రూపొందిందా ? లేదా ? అనేది ఇప్పుడు చూద్దాం.

కథ విషయానికొస్తే :
రాయలసీమ ప్రాంతానికి చెందిన కృష్ణ ( వెంకట్ ) ఎస్‌ఐ ట్రైనింగ్ కోసం హైదరాబాద్ వస్తాడు. తన మిత్రుడు శృంగారం  (నల్ల వేణు) తో కలిసి అద్దెకు దిగుతాడు. అయితే ఇంటి కిరాయి కట్టకపోవడంతో ఓనర్ ఇల్లు ఖాళీ చేయిస్తాడు. అదే సమయంలో డాక్టర్ పల్లవి తన ఇంట్లో కృష్ణ , శృంగారం‌లకు షెల్టర్ ఇస్తుంది. పల్లవి ఇంటి ఎదురుగా ఉండే రాధ (హృశాలి) ని చూసి లవ్‌లో పడతాడు కృష్ణ. రాధ కూడా కృష్ణ‌ని ప్రేమిస్తుంది. అయితే అనూహ్యంగా రాధ వివాహం మరొకరితో నిర్ణయించబడుతుంది. దాంతో  పద్మలాగే రాధ కూడా నన్ను మోసం చేసిందని కుమిలి పోతుంటాడు కృష్ణ. అసలు పద్మ ఎవరు ? కృష్ణ ప్రేమించింది ఎవరిని ? చివరకు ఏమైంది అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

Read Also : వైజాగ్‌లో చాణక్య ప్రీ-రిలీజ్ ఈవెంట్..

నటీనటుల విషయానికొస్తే :
హీరోగా నటించిన వెంకట్‌కు ఇది తొలి చిత్రమే అయినప్పటికీ బాగానే నటించాడు. ఎమోషనల్ సీన్స్‌లో అలాగే యాక్షన్ సీన్స్‌లో కూడా పర్వాలేదు అనిపించాడు. హీరోయిన్లుగా నటించిన పావని , హృశాలి తమతమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ఇక మిగిలిన పాత్రల్లో 30 ఇయర్స్ పృథ్వీ , మిర్చి మాధవి , నల్లవేణు, జబర్దస్త్ బ్యాచ్ కొమరం, గెటప్ శ్రీను, రాజమౌళి, నాగినీడు తదితరులు తమ పాత్రల పరిధి మేర నటించి సినిమా రేంజ్‌ని పెంచారు. 

టెక్నీషియన్స్ విషయానికొస్తే : 
 దర్శకుడు రామ్ రణధీర్‌కి ఇది మొదటి సినిమానే అయినప్పటికీ యూత్‌ని అలరించే అన్ని అంశాలతో రాయలసీమ లవ్ స్టొరీ చిత్రాన్ని రూపొందించాడు. స్టోరీ నడిపే క్రమంలో అక్కడక్కడా తడబడినా పర్వాలేదు అనిపించాడు. డైలాగ్స్ కాస్త పరిధి దాటి ఉన్నట్లు అనిపిస్తాయి.. అవి యువతకి కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి.  పాటల పరంగా ఒకే అనిపిస్తాయి. నేపథ్య సంగీతం కూడా అలరించేలా ఉంది. విజువల్స్ బాగున్నాయి. అయితే ఎడిటింగ్ పరంగా కొన్ని సన్నివేశాలు కట్ చేసి ఉంటే మరింత గ్రిప్పింగ్‌గా ఉండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
ఓవరాల్‌గా : 
రాయలసీమ లవ్ స్టొరీ యూత్‌ని అలరించే సన్నివేశాలతో తెరకెక్కిన ఓ మంచి ప్రయత్నం .