RC15: చరణ్ మూవీ నెక్ట్స్ షెడ్యూల్ జరిగేది ఇక్కడే..!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా చిత్ర యూనిట్ రూపొందిస్తుండగా, ఇందులో రామ్ చరణ్ రెండు వైవిధ్యమైన పాత్రల్లో కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా, ఇటీవల ఓ సాంగ్‌ను న్యూజిలాండ్‌లో షూట్ చేసింది చిత్ర యూనిట్.

RC15: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా చిత్ర యూనిట్ రూపొందిస్తుండగా, ఇందులో రామ్ చరణ్ రెండు వైవిధ్యమైన పాత్రల్లో కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా, ఇటీవల ఓ సాంగ్‌ను న్యూజిలాండ్‌లో షూట్ చేసింది చిత్ర యూనిట్.
RC15: న్యూజిలాండ్‌లో ముగించేసిన చరణ్ అండ్ టీమ్!
ఇక ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ కోసం అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. కాగా, ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్‌ను ఫిబ్రవరి 9-15 మధ్యలో చిత్రీకరించబోతున్నారట. ఈ షెడ్యూల్‌లో ఓ సాంగ్‌ను షూట్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఇక ఈ షెడ్యూల్‌ను వైజాగ్ ఏరియాలో తెరకెక్కించబోతున్నట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఓ చక్కటి సోషల్ మెసేజ్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో చరణ్ సరసన అందాల భామ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది.
RC15 : 15 కోట్లతో RC15 సాంగ్..
ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తుండగా, థమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు. అంజలి, సునీల్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తుండగా, వచ్చే సంక్రాంతి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.