RC15 Movie: రామ్ చరణ్ RC15 మూవీ రిలీజ్ డేట్ మారిందా..?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తోన్న తాజా చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. చరణ్ కెరీర్‌లో 15వ సినిమాగా వస్తున్న ఈ సినిమాతో చరణ్ మరోసారి బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. 2024 సంక్రాంతి బరిలో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

RC15 Movie: రామ్ చరణ్ RC15 మూవీ రిలీజ్ డేట్ మారిందా..?

RC15 Movie Release Date To Be Changed

RC15 Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తోన్న తాజా చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. చరణ్ కెరీర్‌లో 15వ సినిమాగా వస్తున్న ఈ సినిమాతో చరణ్ మరోసారి బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాను దర్శకుడు శంకర్ తనదైన మార్క్ మూవీగా తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా క్రియేట్ అయ్యాయి.

RC15 Movie: RC15 మూవీ సెట్‌లో చరణ్ బర్త్‌డే అడ్వాన్స్ సెలెబ్రేషన్స్..!

ఇప్పటికే మెజారిటీ షూటింగ్ పూర్తవగా, ఇటీవల ఓ సాంగ్ షూటింగ్‌ను పూర్తి చేసుకుంది చిత్ర యూనిట్. ఈ సినిమాలో చరణ్ రెండు వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తున్నాడని చిత్ర యూనిట్ తెలపడంతో, ఈ సినిమాలో ఆయన ఎలాంటి పాత్రలు చేస్తున్నాడా అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ఇక భారీ క్యాస్టింగ్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా కథను శంకర్ ఓ సాలిడ్ సోషల్ మెసేజ్‌తో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడట.

కాగా, ఈ సినిమాను ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, 2024 సంక్రాంతి బరిలో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతున్నట్లుగా తెలిపింది. కానీ, ఇప్పటికే సంక్రాంతి రిలీజ్‌లను లాక్ చేసుకున్నాయి కొన్ని సినిమాలు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రాజెక్ట్-K తోపాటు, తాజాగా మహేష్ బాబు, త్రివిక్రమ్‌ల SSMB28 మూవీ కూడా సంక్రాంతి రిలీజ్‌ను కన్ఫం చేసింది.

RC15: సంక్రాంతి బరిలో ముందుగా ల్యాండ్ అవుతున్న మెగా పవర్ స్టార్..?

దీంతో RC15 మూవీని సంక్రాంతి బరిలో కాకుండా, మార్చి 21న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోందట. చరణ్ నెక్ట్స్ బర్త్ డే కానుకగా ఓ వారం ముందు ఈ సినిమాను రిలీజ్ చేస్తే బాగుంటుందని చిత్ర యూనిట్ భావిస్తోందట. మరి నిజంగానే RC15 మూవీ రిలీజ్ డేట్ మారుస్తారా లేక వేరే ఏదైనా డేట్‌ను కన్ఫం చేస్తారా అనేది చూడాలి. ఇక ఈ సినిమాలో అందాల భామ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోండగా, థమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు.