Deepavali : దసరా అయిపోయింది.. నెక్స్ట్ దీపావళి టార్గెట్.. రిలీజ్ కి రెడీగా ఉన్న సినిమాలు..

దసరా సీజన్ అయిపోయింది. ఇప్పుడు దీపావళి వంతు వచ్చింది. అంటే సౌత్ అండ్ నార్త్ లో మూవీ కార్నివాలే అన్నమాట. అన్ని భాషల్లోని ఫ్యాన్స్ కు దివాళీ ఫీస్ట్ ఇవ్వడానికి క్రేజీ మూవీస్ అన్నీ రింగ్ లోకి దిగిపోతున్నాయి............

Deepavali : దసరా అయిపోయింది.. నెక్స్ట్ దీపావళి టార్గెట్.. రిలీజ్ కి రెడీగా ఉన్న సినిమాలు..

ready to release movies for deepavali

Deepavali :  దసరా సీజన్ అయిపోయింది. ఇప్పుడు దీపావళి వంతు వచ్చింది. అంటే సౌత్ అండ్ నార్త్ లో మూవీ కార్నివాలే అన్నమాట. అన్ని భాషల్లోని ఫ్యాన్స్ కు దివాళీ ఫీస్ట్ ఇవ్వడానికి క్రేజీ మూవీస్ అన్నీ రింగ్ లోకి దిగిపోతున్నాయి. స్టార్ హీరోల సినిమాలు ఫ్యాన్స్ కు దివాళీ ధమాకా ఇవ్వడానికి ఈ సీజన్ నే ఎంచుకుంటారు. ఈ సారి అన్ని సౌత్ లాంగ్వేజెస్ లోని సినిమాలు, బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలు కూడా దీపావళి బరిలోకి దిగుతున్నాయి.

ఈ లిస్ట్ లో ముందుగా బాలీవుడ్ నుంచి ఉన్న క్రేజీ మూవీ అక్షయ్ కుమార్ నటించిన మైథలాజికల్ టచ్ ఉన్న ఫాంటసీ మూవీ ‘రామ్ సేతు’. అభిషేక్ శర్మ డైరెక్షన్ లో అరుణ భాటియా, విక్రమ్ మల్హోత్రా నిర్మాణంలో సినిమా రూపొందింది. తెలుగు టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ కీలక పాత్ర చేయడం విశేషం. జాక్వెలిన్ ఫెర్నాండేజ్, నుష్రత్ భరూచా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. దీపావళి కానుకగా అక్టోబర్ 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. తెలుగులోనూ అదే పేరుతో వస్తోంది. లేటెస్ట్ గా విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలని ఇంకా పెంచేసింది. అయితే అదే రోజున అజయ్ దేవ్ గన్, సిద్ధార్ధ్ మల్హోత్రా ‘థాంక్ గాడ్’ కూడా రిలీజ్ కాబోతోంది. ఈ రెండు సినిమాలకు బాలీవుడ్ లో బాక్సాఫీస్ వార్ తప్పలా లేదు.

ఇక తమిళ్ లో ఇటీవల ‘పొన్నియిన్ సెల్వన్ 1’ మూవీతో పర్లేదనిపించాడు స్టార్ హీరో కార్తి. అందులోని అతడి పాత్ర బాగా పేలడంతో ప్రస్తుతం మనోడు సక్సెస్ హ్యాంగోవర్ లో ఉన్నాడు. ఇదిలా ఉంటే కార్తి తండ్రీ కొడుకులుగా డ్యూయల్ రోల్ చేసిన ‘సర్దార్’ మూవీ ఈ దీపావళికి బరిలోకి దిగుతోంది. ఇరుంబు తిరై, హీరో మూవీస్ ఫేమ్ పీయస్ మిత్రన్ దీనికి డైరెక్టర్. మూవీని ఈ నెల 21న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు. తెలుగులోనూ ఈ మూవీ విడుదల కాబోతోంది.

ఇక తెలుగులో అదే రోజు శివ కార్తికేయన్ నటించిన డైరెక్ట్ తెలుగు మూవీ ‘ప్రిన్స్’ కూడా రిలీజ్ కానుండడం విశేషం. ఇది తమిళ్ లో కూడా అరిలిజ్ అవుతుంది. జాతిరత్నాలు డైరెక్టర్ అనుదీప్ కెవీ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో మరియా రైబోషప్కా అనే ఉక్రెయిన్ బ్యూటీ హీరోయిన్ గా టాలీవుడ్ లో ఇంట్రడ్యూస్ అవుతోంది. అలాగే మంచు విష్ణు చాల రోజుల తర్వాత జిన్నా సినిమాతో దీపావళికి రానున్నాడు. ఇక విష్వక్సేన్ ఓరి దేవుడా సినిమాతో దివాళికి రానున్నాడు. ఇందులో వెంకటేష్ స్పెషల్ క్యారెక్టర్ చేయడం విశేషం.

Ram Charan: RC15 నుంచి లీకైన ఫోటోలు.. అంచనాలను పెంచేస్తున్న రాంచరణ్, శంకర్ సినిమా!

మలయాళంలో కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ లేటెస్ట్ మలయాళ మూవీ ‘మాన్ స్టర్’. ‘మన్యం పులి’ ఫేమ్ వైశాఖ్ దీనికి డైరెక్టర్. హనీరోజ్, సుదేవ్ నాయర్, జానీ ఆంటోనీ, సిద్ధిఖ్.. ఇతరులు ముఖ్యపాత్రలు చేస్తుండగా వీరితో పాటు మంచు లక్ష్మీ ప్రసన్న కూడా నటిస్తోంది. లక్కీ సింగ్ అనే సిఖ్ ఐపీయస్ ఆఫీసర్ గా మోహన్ లాల్ నటిస్తున్నారు. అక్టోబర్ 21న ఈ మూవీ విడుదల కానుండగా అదే రోజున నివీన్ పాలీ హీరోగా నటించిన ‘పడవెట్టు’ అనే వెరైటీ యాక్షన్ మూవీ కూడా విడుదల కాబోతోంది. దీనికి లిజు కృష్ణ డైరెక్టర్. అదితీ బాలన్ హీరోయిన్ గా నటిస్తోంది.

ఈ దీపావళి సీజన్ ను క్యాష్ చేసుకోడానికి హాలీవుడ్ ఇండస్ట్రీ కూడా రెడీ అయిపోయింది. వీటన్నిటికీ పోటీ ఇవ్వడానికి ఓ క్రేజీ హాలీవుడ్ మూవీ రంగంలోకి దిగుతోంది. రాక్ గా ఫేమస్ అయిన డ్వెయిన్ జాన్ సన్ హీరోగా నటిస్తున్న డీసీ ఎక్స్సెడెండ్ యూనివర్స్ లోని పదకొండవ భాగం ‘బ్లాక్ ఆడమ్’ ఈ నెల 20న తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ భాషలతో బాటు హిందీలోనూ రిలీజ్ కాబోతోంది. 2019లో రిలీజైన్ ‘షాజమ్’ కు ఇది కంటిన్యూషన్. అమెరికాలో అయితే ఈ సినిమా అక్టోబర్ 21న విడుదల కాబోతోంది. ఇటీవల రిలీజైన సినిమా టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో దీపావళికి ఈసారి మరిన్ని సినిమాలు క్యూ కట్టాయి. ఈ దీపావళికి ఏ సినిమా పేలుతుందో, ఏ సినిమా తుస్సుమంటుందో చూడాలి.