Mahesh – Trivikram: మహేశ్ హీరోగా త్రివిక్రమ్ మూడో సినిమా.. క్యారెక్టర్ ఇదే
మరోసారి మహేష్‌బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో గ్రాండ్ ప్రాజెక్ట్ రెడీ అవబోతుందని తెలుసుగా. ‘అతడు’ ‘ఖలేజా’ వంటి గుర్తుండిపోయే..

Mahesh Trivikram
Mahesh – Trivikram: మరోసారి మహేష్‌బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో గ్రాండ్ ప్రాజెక్ట్ రెడీ అవబోతుందని తెలుసుగా. ‘అతడు’ ‘ఖలేజా’ వంటి గుర్తుండిపోయే సినిమాల తర్వాత వీరిద్దరి కలయికలో తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్ అభిమానులతో పాటు పరిశ్రమ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మించనున్న ఈ సినిమా మే 31న పూజా కార్యక్రమాలతో లాంచనంగా స్టార్ట్ అవుతుంది. ఈ సినిమాలో మహేష్‌బాబు పాత్ర ఎలా ఉండబోతుందనే ఉత్సుకత అందరిలోనూ కనిపిస్తుంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఇందులో మహేష్‌బాబు ‘రా’ఏజెంట్‌గా కనిపించనున్నారట.
దేశరక్షణ కోసం గూడచర్యం నెరిపే ఏజెంట్‌గా ఆయన పాత్ర విలక్షణంగా సాగుతుందని చెబుతున్నారు. మునుపెన్నడూ చూడని విధంగా మహేష్‌బాబు పాత్ర స్టెలిష్‌గా ఉంటుందని సమాచారం.
కెరీర్లో తొలిసారి ‘రా’ గూఢచారి పాత్రను పోషిస్తుండటంతో.. మహేష్ ఈ సినిమా విషయంలో ఎంతో ఉత్సాహంగా ఉన్నారని చెబుతున్నారు. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
Ready to Start Mahesh Babu – Trivikram Srinivas 3rd Movie