Allu Arjun: చరణ్ బర్త్ డే వేడుకల్లో కనిపించని అల్లు అర్జున్.. రీజన్ ఏమిటో చెప్పిన బన్నీ టీమ్!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల బర్త్‌డే జరుపుకున్న సంగతి తెలిసిందే. చరణ్ బర్త్‌డే పార్టీకి ఇండస్ట్రీకి చెందిన పలువురు స్టార్స్, సెలబ్రిటీలు హాజరయ్యారు. కానీ, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాత్రం ఈ బర్త్‌డే పార్టీలో ఎక్కడా కనిపించలేదు.

Reason For Allu Arjun Not Attending Ram Charan Birthday
Allu Arjun: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల బర్త్‌డే జరుపుకున్న సంగతి తెలిసిందే. చరణ్ బర్త్‌డే పార్టీని గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ పార్టీకి ఇండస్ట్రీకి చెందిన పలువురు స్టార్స్, సెలబ్రిటీలు హాజరయ్యారు. ఇక మెగా ఫ్యామిలీ నుండి దాదాపు అందరూ ఈ బర్త్‌డే పార్టీలో కనిపించారు. కానీ, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాత్రం ఈ బర్త్‌డే పార్టీలో ఎక్కడా కనిపించలేదు.
Allu Arjun: ఇండియాస్ పాపులర్ టాక్ షోలో సందడి చేయనున్న సౌత్ పాన్ ఇండియా స్టార్స్..?
దీంతో సోషల్ మీడియాలో అల్లు అర్జున్, చరణ్‌ల మధ్య ఏదో జరుగుతుందని వార్తలు షికారు చేశాయి. మెగా ఫ్యామిలీతో అల్లు అర్జున్ దూరంగా ఉంటున్నాడని.. వారి మధ్య విబేధాలు వచ్చాయని.. అందుకే బన్నీ చరణ్ బర్త్‌డే పార్టీకి రాలేదనే వార్తలు ఫిలింనగర్‌లో చక్కర్లు కొట్టాయి. అయితే, తాజాగా ఈ వార్తలపై బన్నీ టీమ్ క్లారిటీ ఇచ్చింది. అల్లు అర్జున్ ఆ రోజున వియత్నాంలో ఉన్నారని.. అక్కడ తన కజిన్ పుట్టినరోజుకు హాజరయ్యారని బన్నీ టీమ్ మెంబర్ తెలిపారు.
Ram Charan : దుబాయ్ బయలుదేరిన రామ్‌చరణ్, ఉపాసన..
బన్నీతో పాటు చరణ్ సోదరి కూడా ఈ పార్టీకి హాజరయ్యారని తెలుస్తోంది. వియత్నాంలో తప్పకుండా అటెండ్ కావాల్సిన పార్టీ కాబట్టి, బన్నీ చరణ్ పుట్టినరోజు వేడుకలకు రాలేకపోయాడని.. అయితే వీడియో కాల్ ద్వారా బన్నీ చరణ్‌కు బర్త్‌డే విషెస్ తెలిపాడని ఆయన టీమ్ మెంబర్ తెలిపారు. దీంతో చరణ్, బన్నీల మధ్య విబేధాలు ఉన్నాయనే వార్తకు చెక్ పెట్టినట్లు అయ్యింది. ఇక సినిమాల విషయానికి వస్తే.. బన్నీ ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ పుష్ప-2లో నటిస్తుండగా, చరణ్ దర్శకుడు శంకర్ డైరెక్షన్‌లో ‘గేమ్ చేంజర్’ సినిమాలో నటిస్తున్నాడు.