Raviteja : రామారావు ఆన్ డ్యూటీ.. వాయిదాల మీద వాయిదాలు.. హీరో, నిర్మాత మధ్య గొడవ??

రామారావు ఆన్ డ్యూటీ సినిమా రిలీజ్ వాయిదాల మీద వాయిదాలు పడుతోంది. ఇప్పటికే మూడు సార్లు రిలీజ్ డేట్ వెనక్కెళ్లి పోయింది. ఈ సినిమాను ముందుగా....................

Raviteja : రామారావు ఆన్ డ్యూటీ.. వాయిదాల మీద వాయిదాలు.. హీరో, నిర్మాత మధ్య గొడవ??

Ramarao On Duty

Ramarao On Duty :  శరత్ మండవ డైరెక్షన్ లో మాస్ రాజ రవితేజ నటిస్తున్న సినిమా రామారావు ఆన్ డ్యూటీ. ఈ సినిమాలో రవితేజ సరసన రాజీషా విజయన్, దివ్యాంశ కౌశిక్ నటిస్తున్నారు. చాలా కాలం తర్వాత వేణు తొట్టెంపూడి ఈ సినిమాలో ఓ స్పెషల్ క్యారెక్టర్ తో రీఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమాను చెరుకూరి సుధాకర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా మోషన్ పోస్టర్ రిలీజ్ అయిన దగ్గెర నుంచే ఈ సినిమా పైన మంచి హోప్స్ క్రియేట్ అయ్యాయి. టీజర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

అయితే రామారావు ఆన్ డ్యూటీ సినిమా రిలీజ్ వాయిదాల మీద వాయిదాలు పడుతోంది. ఇప్పటికే మూడు సార్లు రిలీజ్ డేట్ వెనక్కెళ్లి పోయింది. ఈ సినిమాను ముందుగా ఒకే సారి మార్చి 25న కాని, ఏప్రిల్ 14న గాని రిలీజ్ చేస్తామని ప్రకటించారు. మార్చి 25న ట్రిపుల్ ఆర్, ఏప్రిల్ 14న కేజిఎఫ్ 2 భారీ సినిమాలు రిలీజ్ డేట్స్ ఫిక్స్ కావడంతో రామారావు ఆన్ డ్యూటీ సినిమాకు జూన్ 17 డేట్ కి రిలీజ్ ఫిక్స్ చేసుకున్నారు. ఇప్పుడు జూన్ 17నుంచి తప్పుకుని జులై అంటున్నారు. ఇప్పుడీ సినిమా వాయిదాకి కారణం ప్రొడ్యూసర్, హీరోకి మధ్య వచ్చిన అభిప్రాయ బేధాలే అంటున్నారు.

OTT : ఓటీటీ ఊపు అయిపోయిందా?? సినిమాలకి ఇంకో ఇన్‌కం తగ్గనుందా??

సినిమా కమిట్ అయ్యే ముందే ప్రొడ్యూసర్, డైరెక్టర్, హీరో పరస్పర ఒప్పందం కుదుర్చుకుని, సినిమాను పట్టాలెక్కిస్తారు. అయితే సినిమా బిజినెస్ ను బట్టి ముందెంత, తర్వాత ఎంతనే ఒప్పందంతో రామారావు ఆన్ డ్యూటీని రూపొందించినట్టు సమాచారం. ఈ సినిమాపైన భారీ హైప్ క్రియేట్ అవడంతో బిజినెస్ పరంగానూ థియేట్రికల్, శాటిలైట్, ఓటిటి, ఇతర హక్కులకు సంబంధించి మంచి బిజినెస్ జరిగింది. దాంతో ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం బిజినెస్ ను బట్టి తనకు రావాల్సిన వాటా ఇవ్వాలని రవితేజ సైడ్ నుంచి డిమాండ్ రాగా, ఈ సినిమా కాగితాల వరకు బిజినెస్ జరిగినా ఇంకా చేతికి డబ్బులు అందలేదని ప్రొడ్యూసర్ సైడ్ నుంచి టాక్ వినిపిస్తోంది. సో వీళ్లిద్దరూ ఒక నిర్ణయానికొస్తే చివరి దశలో ఉన్న పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసకుని, ఈ సినిమా రిలీజ్ అవుతుందని టీమ్ నుంచి అందుతున్న సమాచారం. రవితేజ అభిమానులు మాత్రం ఈ సినిమా విడుదల కోసం ఎదురు చూస్తున్నారు.