‘సాహో’ కోసం ఎనిమిది కిలోలు తగ్గిన – ప్రభాస్

  • Published By: veegamteam ,Published On : April 30, 2019 / 06:18 AM IST
‘సాహో’ కోసం ఎనిమిది కిలోలు తగ్గిన – ప్రభాస్

రెబల్ స్టార్ ప్రభాస్ ‘బాహుబలి’ సినిమాలో అమరేంద్ర బాహుబలి పాత్ర కోసం రాజసం ఉట్టిపడేలా తన ఫిజిక్‌ని మార్చుకున్నారు. ఇప్పుడు ప్రభాస్ నటిస్తున్న మరో సినిమా ‘సాహో’ కోసం బాడీ వెయిట్ ను తగ్గించుకున్నారు. అందుకు సరైన కార్బో హైడ్రేట్స్‌ డైట్‌తో దాదాపు ఎనిమిది కిలోలు తగ్గారు. ఈ చిత్రంలో యాక్షన్‌ సీన్స్‌ అద్భుతంగా ఉంటాయి. ఈ సీన్లు పర్‌ఫెక్ట్‌గా రావడం కోసం హాలీవుడ్‌ స్టంట్‌ నిపుణుల సహాయం తీసుకున్నాం.

ఈ సినిమాలో హీరోయిన్‌ శ్రద్ధా కపూర్‌తో అద్భుతమైన లవ్‌స్టోరీ కూడా ఉంది. వంశీ, ప్రమోద్ లు నిర్మస్తున్న ‘సాహో’ చిత్రానికి సుజిత్ దర్శకత్వం వహిస్తున్నారు.  ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ ముంబైలో జరుగుతోంది. నెక్ట్స్‌ షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో ప్లాన్‌ చేసినట్లు తెలిసింది.