Prabhas: పాన్ వరల్డ్ స్థాయికి రెబల్ స్టార్.. తొమ్మిది భాషల్లో స్పిరిట్?

రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా కాదు.. ఈసారి పాన్ వరల్డ్ స్థాయికి టార్గెట్ చేశాడు. వరసగా అరడజను సినిమాల లైనప్ సెట్ చేసిన ప్రభాస్ వందల కోట్ల బిజినెస్ టార్గెట్ చేశాడు..

Prabhas: పాన్ వరల్డ్ స్థాయికి రెబల్ స్టార్.. తొమ్మిది భాషల్లో స్పిరిట్?

Prabhas

Prabhas: రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా కాదు.. ఈసారి పాన్ వరల్డ్ స్థాయికి టార్గెట్ చేశాడు. వరసగా అరడజను సినిమాల లైనప్ సెట్ చేసిన ప్రభాస్ వందల కోట్ల బిజినెస్ టార్గెట్ చేశాడు. ప్రస్తుతానికి ప్రభాస్ రాధేశ్యామ్ మూవీ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఆల్రెడీ నెక్ట్స్ సమ్మర్ రిలీజ్ కు ఎయిమ్ చేసుకుని ఓమ్ రౌత్ తో చేస్తున్న ఆదిపురుష్ సినిమాని ఓ కొలిక్కి తీసుకొచ్చిన ప్రభాస్ సలార్ ని స్పీడప్ చెయ్యడానికి ఇప్పటికే ప్లాన్ చేసుకున్నారు. ప్రశాంత్ నీల్ తో చేస్తున్న సలార్ సినిమా అవ్వకుండానే నాగాశ్విన్ తో ప్రాజెక్ట్ కె ని ప్లాన్ చేశారు.

Liger: మరింత ఆలస్యంగా రానున్న రౌడీ హీరో.. కారణం ఏంటంటే?

ఇక ఇప్పటికే 24వ సినిమాను సిద్దార్థ్ ఆనంద్‌తో చేయనున్నట్టు తెలుస్తుండగా ఆ సినిమా మొదలు కాకముందే సందీప్ రెడ్డి వంగాతో తన 25వ సినిమా అనౌన్స్ చేశారు. ఆల్రెడీ ఈ 5 సినిమాలతో పాటు ప్రభాస్ మరో మూడు సినిమాల్ని లైనప్ చేస్తున్నాడని టాక్ నడుస్తుంది. సాహో ప్రభాస్ 19వ కాగా సందీప్ వంగాతో మొదలైన సినిమా 25వ సినిమా. అంటే ప్రస్తుతం ప్రభాస్ చేతిలో అరడజను సినిమాలున్నాయి. అన్నీ పాన్ ఇండియా సినిమాలే కాగా మార్కెట్ కూడా వెయ్యికి కోట్లకు పైమాటే.

Acharya: చిరు ఈ ఏడాది వస్తాడా.. లేక వచ్చే ఏడాదికి వెళ్తాడా?

అయితే.. ప్రభాస్ నుండి ఈసారి పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ సినిమాలు సిద్దమవుతున్నాయని ఇండస్ట్రీ టాక్. ఆదిపురుష్, నాగశ్విన్ కె సినిమాలు ఇండియాలోని అన్ని బాషలతో పాటు చైనీస్, జాపనీస్ బాషలలో కూడా విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. వీలయితే.. ఇంగ్లీష్ లో కూడా విడుదల చేసే సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాల సంగతెలా ఉన్నా.. సందీప్ వంగా సినిమా ఇప్పటికే ఎనిమిది బాషలలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అయితే.. ఆదిపురుష్, ప్రాజెక్ట్ కె ఫలితాలను బట్టి సందీప్ సినిమాను ఇంగ్లీష్ లో కూడా విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట. అదే నిజమైతే.. నో డౌట్ ప్రభాస్ పాన్ వరల్డ్ హీరో అయినట్లే!