Prabhas: ప్రభాస్ జాతర.. డేట్స్ కోసం వెంటపడుతున్న ప్రొడ్యూసర్స్! Rebel Star Prabhas mania .. Producers chasing for dates!

Prabhas: ప్రభాస్ జాతర.. డేట్స్ కోసం వెంటపడుతున్న ప్రొడ్యూసర్స్!

తెలుగు హీరోలు జోరు మామూలుగా లేదు. ఓ పక్క కోవిడ్ - ఇండస్ట్రీతో ఒక ఆట ఆడుకుంటున్నా.. హీరోల జోరు మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు.

Prabhas: ప్రభాస్ జాతర.. డేట్స్ కోసం వెంటపడుతున్న ప్రొడ్యూసర్స్!

Prabhas: తెలుగు హీరోలు జోరు మామూలుగా లేదు. ఓ పక్క కోవిడ్ – ఇండస్ట్రీతో ఒక ఆట ఆడుకుంటున్నా.. హీరోల జోరు మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు. ఇక రెబల్ స్టార్ ప్రభాస్ స్పీడు.. ప్లానింగ్, డిమాండ్ గురించి చెప్పక్కర్లేదు. అయిదు సినిమాలు క్యూలో ఉంటే.. ప్రభాస్ కోసం కనీసం ఇంకో మూడు ప్రాజెక్టులు డేట్స్ కోసం ఎదురు చూస్తున్నాయి. ఇండియాలో ఈ మధ్య కాలంలో ఏ సూపర్ స్టార్ కూ లేనంత డిమాండ్ ప్రభాస్ కు ఉంది.

Prabhas: నా రూటే సపరేట్.. సినిమా సినిమాకి ప్రభాస్ వేరియేషన్స్!

వంద కోట్ల రూపాయలు ఏంటి… కావాలంటే ఇంకో పాతిక వేసుకుని సినిమా డేట్స్ ఇయ్యిబాబు అని ప్రొడ్యూసర్స్ ప్రభాస్ వెంటపడుతున్నారు. ఓటిటిలో వారానికో సినిమా రిలీజయినట్లు… ప్రబాస్ సినిమాల లిస్ట్ చాంతాడంత పెరిగిపోతోంది. బాహుబలితో రెబల్ స్టార్ మహర్దశ మొదలైందని ఫాన్స్ ఎప్పుడో ఫిక్సైపోయారు. పక్కా లవ్ స్టోరీతో వస్తోన్న రాధేశ్యామ్ తో ప్రభాస్ మార్చిలో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

Allu Arjun: బన్నీ కోసం బాలీవుడ్ ప్రెస్టీజియస్ బ్యానర్స్ వెయిటింగ్!

పూజ హెగ్డే కాంబినేషన్ లో వస్తున్న ఈ ప్రేమ కథా చిత్రమ్ పై ఆలిండియా లెవల్లో ఫాన్స్ ఎగ్జయిటింగ్ గా ఎదురుచూస్తున్నారు. రాధేశ్యామ్ కు దాదాపు రెండేళ్లకు పైగా తీసుకున్న ప్రభాస్ తర్వాత సినిమా విషయంలో మాత్రం సూపర్ ఫాస్ట్ గా ఉన్నాడు. ఓమ్ రౌత్ డైరెక్షన్లో ఆదిపురుష్ సినిమా ఆల్ మోస్ట్ కంప్లీ ట్ అయింది. అన్నీ కుదిరితే క్రుతిసనన్ జోడిగా వస్తున్న ఆదిపురుష్ ఆగస్టులో ఆడియన్స్ ముందుకు వచ్చే అవకాశం ఉంది.

RRR: చరణ్-తారక్ లలో రాజమౌళికి ఇష్టమైన పాత్ర ఇదే!

రాధేశ్యామ్ , ఆదిపురుష్ కాకుండా 2022లో మూడో సినిమాతో ఫ్యాన్స్ ని ప్రభాస్ సర్ప్రైజ్ చేసే అవకాశం ఉంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో సలార్ మూవీ ఈ యేడాది చివర్లో రిలీజ్ అయ్యే చాన్స్ ఉంది. శ్రుతి హాసన్ కాంబినేషన్లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను జెట్ స్పీడులో కంప్లీట్ చేయాలని ప్రశాంత్ నీలో అనుకుంటున్నాడు. అదే జరిగితే 2022 లాస్ట్ క్వార్టర్లో సలార్ బాక్సాఫీసును షేక్ చేయడం ఖాయమని ఫ్యాన్స్ లెక్కలు వేస్తున్నారు.

Prabhas : ప్రభాస్‌తో ‘రాజా డీలక్స్’.. మారుతి ఏమన్నాడంటే..

సలార్ తర్వాత అభిమానుల భారీ అంచనాలు పెట్టుకున్న మిస్టర్ కె షూటింగ్ ఏప్రిల్ తర్వాత పరుగులు పెట్టే అవకాశం ఉంది. పాన్ ఇంటర్నేషనల్ మూవీ అని నాగ్ అశ్విన్ చెప్పినప్పటి నుంచి మిస్టర్ కె మీద ఎక్స్పెక్టేషన్లను పీక్స్ కు వెళ్లాయి. దీపికా పదుకోన్ ఈ సినిమాలో మెయిన్ లీడ్ కావడంతో ప్రభాస్ కెరీర్ లోనే మిస్టర్ కె బిగ్గెస్ట్ మూవీ అవుతుందని ఫాన్స్ ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు.

Prabhas : ప్రభాస్‌తో ‘రాజా డీలక్స్’.. మారుతి ఏమన్నాడంటే..

అర్జున్ రెడ్డి – కబీర్ సింగ్ సినిమాలతో ఆల్ ఇండియా రేంజ్ కి వెళ్లిన సందీప్ వంగ కాంబినేషన్ లో ప్రభాస్ చేస్తున్న స్పిరిట్ మూవీ షూటింగ్ వచ్చే ఏడాది స్పీడందుకోనుంది. స్పిరిట్ లో అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్ రోల్ లో ప్రభాస్ రప్పాడించనున్నాడు. ప్రభాస్ కెరీర్ లో ఇది 25 సినిమా. ఇవి కాకుండా మైత్రి మూవీస్ కూడా రెబల్ స్టార్ కోసం కర్చీఫ్ వేసింది. వార్ మూవీ డైరెక్టర్ సిద్దార్ధ్ ఆనంద్ ప్రభాస్ డేట్స్ కోసిం ఎదురు చూస్తున్నాడు.

Prabhas : ప్రభాస్‌తో ‘రాజా డీలక్స్’.. మారుతి ఏమన్నాడంటే..

ఈ ఆరు సినిమాలు కాకుండా అన్నీ కుదిరతే దిల్ రాజు ప్రొడక్షన్ లో కూడా ప్రభాస్ మూవీ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఏడు ప్రాజెక్టులతో రెబల్ స్టార్ ఏ సూపర్ స్టార్ కీ అందనంత రేంజ్ కి చేరిపోయాడు. ఇవి కాకుండా ప్రభాస్ ని యథాలాపంగా కలిసిన డైరెక్టర్లు ప్రాడ్యూసర్లు కూడా ప్రభాస్ తో సినిమా చేస్తున్నామని గ్రాఫ్ పెంచుకునే పనిలో పడ్డారు.

×