Prabhas: ఫ్యాన్స్ ఆకలి తీర్చేసే రెబల్ స్టార్.. ట్రిపుల్ బొనాంజా!

ప్రభాస్ ఫ్యాన్స్ కి ఫీస్ట్ ఇవ్వడానికి రెడీ అయ్యాడు. రెండేళ్ల నుంచి ఒక్క సినిమా కూడా రిలీజ్ చెయ్యకుండా ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేసిన రెబల్ స్టార్ ఈసారి అసలుకి వడ్డీతో కలిపి..

Prabhas: ఫ్యాన్స్ ఆకలి తీర్చేసే రెబల్ స్టార్.. ట్రిపుల్ బొనాంజా!

Prabhas

Prabhas: ప్రభాస్ ఫ్యాన్స్ కి ఫీస్ట్ ఇవ్వడానికి రెడీ అయ్యాడు. రెండేళ్ల నుంచి ఒక్క సినిమా కూడా రిలీజ్ చెయ్యకుండా ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేసిన రెబల్ స్టార్ ఈసారి అసలుకి వడ్డీతో కలిపి కొట్టేద్దామని రెడీ అయ్యాడు. అసలు సంవత్సరానికి ఒక్క సినిమాకే కష్టమనుకుంటే.. నెక్ట్స్ ఇయర్ ఏకంగా 3 సినిమాల రిలీజ్ తో రెడీ అవుతున్నాడు ప్రభాస్.

Sarayu Roy: నేను వర్జిన్ కాదు.. ఏడేళ్ల సహజీవనం.. సరయు బోల్డ్ కామెంట్స్!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంత కాదనుకున్నా.. ప్యాన్ ఇండియా స్టార్ కున్న క్రేజే వేరు. అందుకే ప్రభాస్ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఎదురుచూస్తూ ఉంటారు. ఈమధ్యకాలంలో సినిమా సినిమాకీ బాగా టైమ్ తీసుకుంటున్న ప్రభాస్.. రెండేళ్లనుంచి ఒక్క సినిమా కూడా రిలీజ్ చెయ్యలేదు. అసలే డిసప్పాయింట్ అయి ఉన్న ఫ్యాన్స్ కి నెక్ట్స్ ఇయర్ ట్రిపుల్ బొనొంజా పక్కా అంటూ లేటెస్ట్ గా కన్ఫామ్ చేశాడు.

Liger-Mike Tyson: కలలో కూడా ఊహించలే.. తెలుగు తెరకి మరో ఘనత!

సంవత్సరానికి ఒక్క సినిమా రిలీజ్ కే కష్టపడుతున్న ప్రభాస్.. నెక్ట్స్ ఇయర్ మూడు సినిమాలతో ప్రేక్షకులముందుకొస్తున్నారు. లేటెస్ట్ గా ఆదిపురుష్ సినిమాని ఆగస్ట్ 11, 2021న రిలీజ్ చేస్తున్నట్టు మరోసారి కన్ ఫామ్ చేశారు టీమ్. ప్రభాస్ రాముడి క్యారెక్టర్ లో బాలీవుడ్ డైరెక్టర్ ఓమ్ రౌత్ తోచేస్తున్న ఆదిపురుష్ మూవీ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది.

Big Boss 5: ఎలిమినేషన్ గండం.. నాలుగో వారంలో ఎనిమిది మంది

ఆదిపురుష్ కంటే ముందే వచ్చే సంవత్సరం రెండు సినిమాలు రిలీజ్ లైన్లో ఉన్నాయి. 2019లో వచ్చిన సాహో తర్వాత ఏ సినిమా రిలీజ్ చెయ్యలేదు ప్రభాస్. ఇదిగో రిలీజ్ అదిగో రిలీజ్ అంటూ పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తున్న రాధేశ్యామ్ కొత్త సంవత్సరంలో సంక్రాంతి పండక్కి రిలీజ్ అవుతోంది. రాధేశ్యామ్ సందడి అవ్వగానే.. సమ్మర్ స్టార్ట్ అయ్యే లోపే సలార్ రిలీజ్ ను సెట్ చేశాడు ప్రభాస్.

RRR: ఆర్ఆర్ఆర్ కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్?

కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్ లో రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది. సినిమా స్టార్ట్ చేసినప్పుడే రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. శ్రుతి హాసన్ హీరోయిన్ గా చేస్తున్న సలార్ మూవీ కూడా ప్యాన్ ఇండియా లెవల్లోనే ఆడియన్స్ ముందుకొస్తోంది. ఇలా ఒకటి కాదు రెండు కాదు.. మొత్తం 3 సినిమాలతో ఫ్యాన్స్ కి ఫీస్ట్ రెడీ చేస్తున్నారు ప్రభాస్.