Rebels of ThupakulaGudem : ‘రెబెల్స్ ఆఫ్ తుపాకులగూడెం’ సెన్సార్ పూర్తి.. ఫిబ్రవరి 3న విడుదల

ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రెబెల్స్ ఆఫ్ తుపాకుల గూడెం అనే చిత్రం రాబోతోంది. వారధి క్రియేషన్స్ ప్రై.లి. బ్యానర్ మీద ఈ సినిమాను జైదీప్ విష్ణు దర్శకుడిగా తెరకెక్కిస్తున్నాడు. ప్రవీణ్‌ కండెలా, శ్రీకాంత్ రాథోడ్.............

Rebels of ThupakulaGudem : ‘రెబెల్స్ ఆఫ్ తుపాకులగూడెం’ సెన్సార్ పూర్తి.. ఫిబ్రవరి 3న విడుదల

Rebels of ThupakulaGudem releasing on February 3rd

Rebels of ThupakulaGudem :  ఆడియెన్స్ సినిమాలను చూసే ధోరణి మారిపోయింది. ప్రస్తుతం కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలను ఎక్కువగా ఆదరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రెబెల్స్ ఆఫ్ తుపాకుల గూడెం అనే చిత్రం రాబోతోంది. వారధి క్రియేషన్స్ ప్రై.లి. బ్యానర్ మీద ఈ సినిమాను జైదీప్ విష్ణు దర్శకుడిగా తెరకెక్కిస్తున్నాడు. ప్రవీణ్‌ కండెలా, శ్రీకాంత్ రాథోడ్, జాయెత్రి మకానా, శివరామ్ రెడ్డి ఇలా నలభై మంది కొత్త నటీనటులతో రాబోతోన్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఆ మధ్య రెబెల్స్ ఆఫ్ తుపాకుల గూడెం టీజర్‌ను సక్సెస్ ఫుల్ డైరెక్టర్ హను రాఘవపూడి రిలీజ్ చేయగా సోషల్ మీడియాలో విశేషమైన స్పందన లభించింది.

2 నిమిషాలు 29 సెకన్ల నిడివి ఉన్న టీజర్‌లో డైలాగ్స్, విజువల్స్, నటీనటుల పర్ఫామెన్స్‌ ఇలా అన్నీ కూడా జనాలను ఆకట్టుకున్నాయి. ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలకు సంగీతాన్ని అందించిన మణిశర్మ ఈ సినిమాకు పని చేయడం విశేషం. ఆయన మ్యూజిక్, ఆర్ఆర్ టీజర్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచిన విషయం తెలిసిందే.

James Cameron : ఆ రికార్డు సాధించిన డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ ఒక్కడే..

అయితే ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు తాజాగా పూర్తయ్యాయి. సెన్సార్ నుంచి ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ వచ్చింది. ఎంతో గొప్పగా ఈ చిత్రాన్ని తీశారని సెన్సార్ సభ్యులు ప్రశంసించారు. ఫిబ్రవరి 3న ఈ చిత్రం విడుదల కాబోతున్నట్టుగా మేకర్లు ప్రకటించారు. ఈ మేరకు రిలీజ్ చేసిన పోస్టర్‌లో అన్ని క్యారెక్టర్లను చూపించారు. పోస్టర్‌ ఎంతో ఇంటెన్స్ గా కనిపిస్తోంది. దర్శకుడు జైదీప్ విష్ణు ఈ సినిమాకు ఎడిటర్‌గానూ పని చేశారు. ఈ సినిమాకు సంతోష్ మురారికర్ కథ అందించారు.