Squid Game: రికార్డ్స్ బద్దలు కొడుతున్న స్క్విడ్ గేమ్.. ఎందుకింత క్రేజ్?

అమెరికాతో సహా ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ విన్నా సినీ అభిమానుల దగ్గర వినిపిస్తున్న ఏకైక పేరు స్క్విడ్ గేమ్. దక్షణ కొరియా దర్శకుడు తెరకెక్కించిన ఈ సిరీస్ ఇప్పుడు ప్రపంచాన్ని..

Squid Game: రికార్డ్స్ బద్దలు కొడుతున్న స్క్విడ్ గేమ్.. ఎందుకింత క్రేజ్?

Squid Game (1)

Squid Game: అమెరికాతో సహా ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ విన్నా సినీ అభిమానుల దగ్గర వినిపిస్తున్న ఏకైక పేరు స్క్విడ్ గేమ్. దక్షణ కొరియా దర్శకుడు తెరకెక్కించిన ఈ సిరీస్ ఇప్పుడు ప్రపంచాన్ని దున్నేస్తుంది. పదేళ్లుగా ఎందరో రిజెక్ట్ చేసిన ఈ కథ ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లాంటి ఓటీటీకి సరికొత్త రికార్డులు తెచ్చిపెట్టింది. సమాజంలో భావోద్వేగాలు, అసమానలతను కళ్ళకు కట్టినట్లు చూపిస్తూనే.. అంతకు మించిన ఉత్కంఠ.. సమాజంలో మధ్యతరగతి మనుషులు అనుభవించే కష్టాలు లాంటి యూనివర్సల్ సమస్యలతో తెరకెక్కిన ఈ దక్షణ కొరియా వెబ్ సిరీస్ ప్రపంచం మొత్తాన్ని ఆకట్టుకుంటుంది.

Netflix : స్క్విడ్ గేమ్ రికార్డు

గత నెల 17వ తేదీన నెట్ ఫ్లిక్స్ లో ప్రసారమైన ఈ ఈ వెబ్ సిరీస్ అందర్నీ ఆకట్టుకుంది. ఈ సిరీస్ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా నెంబర్ వన్ సిరీస్ గా నిలిచింది. నెట్ ఫ్లిక్స్ చరిత్రలో రికార్డులు సృష్టించింది. విడుదలైన 28 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 11 కోట్ల మంది నెట్ ఫ్లిక్స్ యూజర్లు స్వ్కిడ్ గేమ్ వెబ్ సిరీస్ ను చూడడం విశేషం కాగా.. 90 దేశాల్లో నంబర్ 1గా నిలిచింది. అయితే అసలు ఈ సిరీస్ ఈ స్థాయి ప్రపంచ ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి కారణం ఏంటి.. అసలు ఈ కథలో ఏముంది.. ఈ సిరీస్ పై ప్రేక్షకులకు ఎందుకిత క్రేజ్ అన్నది తెలుసుకుందాం.

GAAMI: ‘గామి’తో మరో ప్రయోగం.. అఘోరాగా విశ్వక్ సేన్!

అప్పులపాలై.. జీవితంలో సర్వస్వం కోల్పోయిన 456 మందిని ఒక రహస్య దీవికి తీసుకెళ్ళి అక్కడ మొత్తం ఆరు ఆటల పోటీలు నిర్వహిస్తారు. ఇందులో చివరి ఆట పేరే ‘స్క్విడ్‌ గేమ్’‌. దక్షిణ కొరియాలో బాగా ప్రాచుర్యంలో ఉన్న చిన్నపిల్లల ఆట ఇది. ఈ ఆరు ఆటల్లో విజేతలుగా నిలిచిన వారికి మొత్తం 45.6 బిలియన్ కొరియన్ వన్ (39 మిలియన్ డాలర్లు) గెలుచుకోనే అవకాశం ఉండగా.. ఈ ఆటలో ఓడిపోయినవారిని చంపేస్తారు. ఆ విషయం కూడా మొదటి ఆట తర్వాతే పోటీలో ఉన్న వారికి తెలుస్తుంది. అక్కడ నుండే సిరీస్ మరింత ఆసక్తిగా అంతకు మించిన ఉత్కంఠగా మారుతుంది.

Telugu Films Releases: టార్గెట్ డిసెంబర్.. అందరి చూపు ఈనెలపైనే!

ఈ ఆటల పోటీల్లో కొన్నిసార్లు సొంతవాళ్లనే మోసం చేసుకొనే పరిస్థితిలతో పాటు స్నేహం, సహకారం, మోసం, త్యాగాలతో వెబ్ సిరీస్‌ ఆద్యాంతం భావోద్వేగాల ప్రయాణంలా సాగి చూసే ప్రేక్షకుడికి కళ్లని తడిపేస్తుంది. సమాజంలో ఆర్ధిక అసమానలతలు నిండిన ఈ పాత్రలన్నీ మన చుట్టూ కనిపించే మనుషుల్లాగే ఉండడం కూడా ఈ వెబ్‌ సిరీస్‌ విజయానికి మరో కారణం. ప్రపంచంలోనే అత్యంత సంపన్నులైన బిలియనీర్లు ఈ ఆటను వినోదం కోసం సృష్టించుకుంటే.. ఎన్నో సమస్యల కారణంగా డబ్బుల కోసం సామాన్య ప్రజలు ఈ ఆటలలో పాల్గొని వాళ్లు కొట్టుకు చస్తుంటే ఆ సంపన్నులు అందులో ఆనందాన్ని వెతుక్కుంటారు.

Telugu Films: దండయాత్ర.. ఇది బాలీవుడ్ మీద తెలుగు హీరోల దండయాత్ర!

ఈ పోటీ ప్రపంచంలో పడి మానవత్వాన్ని పూర్తిగా మర్చిపోతున్న మనుషుల నిజస్వరూపాన్ని ఈ సిరీస్ లో కనిపించడంతో ఈ సిరీస్ ఈ స్థాయి విజయాన్ని దక్కించుకోగా చాలా దేశాలలో ఇప్పటికీ ఈ అంతరాలతో మనుషులు నలిగిపోతున్నారని ఈ సిరీస్ రుజువు చేసింది. దక్షిణ కొరియా దర్శకుడు హ్వాంగ్‌ డాంగ్‌ హ్యుక్ ఈ కథను 2009లోనే రాసుకోగా.. స్క్రిప్ట్‌తో ఏ స్టూడియోకి వెళ్లినా చిన్నపిల్లల ఆటను ఎవరు చూస్తారని తిరస్కరణే. అయితే కొవిడ్‌ తర్వాత పరిస్థితులతో నెట్ ఫ్లిక్స్ ఈ కాన్సెప్ట్ హక్కులు తీసుకొని నిర్మించగా.. హ్వాంగ్‌ డాంగ్‌ హ్యుక్ తాను అనుకున్న కథను దృశ్య రూపంలో అద్భుతంగా తెరకెక్కించాడు. కరోనా తర్వాత ప్రపంచంలో పరిస్థితిలు కూడా ఈ సిరీస్ కు మరింత కనెక్ట్ అయ్యేలా చేసిందని ట్రెండ్ పండితులు అంచనా వేస్తున్నారు.