Cannes Film Festival: రెడ్ కార్పెట్ హీట్.. కాన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో సౌత్ తారల సందడి! Red carpet heat .. Southern stars buzzing at the Cannes Film Festival!

Cannes Film Festival: రెడ్ కార్పెట్ హీట్.. కాన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో సౌత్ తారల సందడి!

ప్రపంచ సినిమా రంగంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే కాన్స్ ఫిలిం ఫెస్టివల్ గ్రాండ్ గా జరుగుతోంది. ఫ్రాన్స్ వేదికగా జరుగుతున్న ఈ ఫెస్టివల్ లో ఈసారి సౌత్ ఇండియన్ తారల సందడి చేయడం విశషం.. ఫస్ట్ టైమ్ కాన్స్ ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొన్న తమన్నా, పూజాహెగ్డే..

Cannes Film Festival: రెడ్ కార్పెట్ హీట్.. కాన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో సౌత్ తారల సందడి!

Cannes Film Festival: ప్రపంచ సినిమా రంగంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే కాన్స్ ఫిలిం ఫెస్టివల్ గ్రాండ్ గా జరుగుతోంది. ఫ్రాన్స్ వేదికగా జరుగుతున్న ఈ ఫెస్టివల్ లో ఈసారి సౌత్ ఇండియన్ తారల సందడి చేయడం విశషం.. ఫస్ట్ టైమ్ కాన్స్ ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొన్న తమన్నా, పూజాహెగ్డే, తమ గ్లామర్ లుక్స్ తో, ఫ్యాషన్ డ్రెస్సులతో రెడ్ కార్పెట్ ను హీటెక్కించారు. ఎప్పటిలాగే నార్త్ తారలు ఫోటో షూట్స్, ర్యాంప్ వాక్ లతో రచ్చ చేస్తున్నారు.

2022 Cannes Film Festival: ఈసారి కాన్స్ ఫెస్టివల్‌లో రెడ్ కార్పెట్‌పై సౌత్ స్టార్స్!

ఫ్రాన్స్ లో జరుగుతున్న కాన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ఈ ఇయర్ దీపికా పడుకోన్ జ్యూరీ సభ్యురాలుగా ఉంది. పది రోజుల పాటు జరగనున్న ఈ ఫెస్టివల్స్ లో అన్ని రోజులూ దీపికా పాల్గొంటుంది. అయితే ఈ ఫెస్టివల్స్ లో ఈ సారి సౌత్ ఇండియా తారలకు ప్రధాన్యత దక్కడం విశేషం. ఇక ఫస్ట్ డే దీపికా పదుకోన్ తో పాటు, ఊర్వశి రౌతెల్లా రెడ్ కార్పెట్ పై మెరిశారు. తమన్నా బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ లో తళుక్కుంది. ర్యాంప్ వాక్ లతో అక్కడి వాళ్లను ఆకట్టుకుంది. రెండో రోజు కూడా తన ఫ్యాషన్ సెన్స్ ను చాటుకుంది. బ్లాక్ కలర్ నెక్ లైన్ బాడీకాన్ గౌనుతో రెడ్ కార్పెట్ ను హీటెక్కించింది. కమలహాసన్ విక్రమ్ ట్రయిలర్ కూడా ఈ ఫెస్టివల్ లో రిలీజ్ కావడం విశేషం.

Cannes Film Festival : భారత నటికి అరుదైన గౌరవం.. కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ జ్యూరీలో దీపికా పదుకొణె..

రెండో రోజు ఈ ఫిలిం ఫెస్టివల్ లో ఐశ్వర్య రాయ్ సందడి కనిపించింది. క్వీన్ ఆఫ్ కాన్స్ గా గుర్తింపున్న ఐశ్వర్య బ్లాక్ డ్రెస్ లో సింపుల్ మేకప్ లో రెడ్ కార్పెట్ పైకి రాగానే అతిథులతో పాటు, కెమెరా లెన్స్ లన్నీ ఆమెవైపే తిరిగాయి. ఇంకా సౌత్ ఇండియా హీరోయిన్ పూజా హెగ్డే ర్యాంప్ వాక్ వీడియో వైరల్ గామారింది. హాలీవుడ్ టాప్ స్టార్ టామ్ క్రూజ్ టాప్ గన్ మావెరిక్ ప్రీమియర్ లో క్రీమ్ గోల్డ్ కలర్ గౌనులో మెరిసింది జిగేల్ రాణి. రెడ్ కార్పెట్ పై ర్యాంప్ వాక్ చేసిన ఈ బుట్టబొమ్మ అందాలను తమ కెమెరాలో బంధించేందుకు ఫ్రాన్స్ ఫోటో గ్రాఫర్స్ పోటీ పడ్డారు. కాన్స్ ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొనే ఛాన్స్ వచ్చినందుకు చాలా హాపీగా ఫీలవుతోంది ఈ రాధేశ్యామ్ బ్యూటీ.

Cannes 2022 : సినీ ప్రపంచం అండగా నిలవాలి.. కాన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌‌లో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్స్‌కీ ప్రసంగం

ఇక మూడో రోజు దీపికా పదుకోన్ తిక్ రెడ్ గౌన్ లో తళుక్కున మెరిసింది. ఇండియన్ పెవిలియన్ ఓపెనింగ్ సెర్మనీలో ఇండియన్ సినిమా తీరు తెన్నుల గురించి గొప్పగా చెప్పిన దీపిక ఎప్పటికప్పుడు ఈ ఈవెంట్ వివరాలను తన ఇనస్టా హాండిల్ ద్వారా షేర్ చేస్తోంది. ఫోర్త్ డే దీపికాతోపాటు, ఐశ్వర్య రాయ్ ఆర్మగెడాన్ టైమ్ ప్రీమియర్ కు హాజరయ్యారు. ఐశ్యర్యా పాస్టల్ పింక్ కలర్ గౌనులో ఆహుతులను ఎట్రాక్ట్ చేసింది. హీనాఖాన్ రెడ్ కార్పెట్ పైన వాక్ చేసి ఆకట్టుకుంది. మాధవన్ ఫస్ట్ టైమ్ డైరెక్ట్ చేసిన రాకెట్రీ నంబీ ఎఫెక్ట్ వరల్డ్ ప్రీమియర్ ఈ ఫెస్టివల్ లో గురువారం ప్రదర్శించబడింది. మే 16నుంచి ఫ్రాన్స్, రివిరియాలో స్టార్ట్ అయిన 75 కాన్స్ ఫిలిం ఫెస్టివల్ కు ఈసారి నార్త్ నుంచే కాదు, సౌత్ ఇండస్ట్రీ నుంచి కూడా స్టార్స్, సెలబ్రిటీస్ హాజరు కావడం విశేషం.

×