RRR: అమెరికాలో ఆర్ఆర్ఆర్ టికెట్ల రేట్ల తగ్గింపు.. కారణమేంటి?

ఇండియన్ సినిమాకి యూఎస్ మార్కెట్ చాలా కీలకం. అందునా మన తెలుగు సినిమాకి అమెరికాలో భారీ మార్కెట్ ఉంటుంది. అందుకే మన హీరోలు, దర్శక, నిర్మాతలు అక్కడ ఉన్న మన వాళ్ళని దృష్టిలో..

RRR: అమెరికాలో ఆర్ఆర్ఆర్ టికెట్ల రేట్ల తగ్గింపు.. కారణమేంటి?

Rrr

RRR: ఇండియన్ సినిమాకి యూఎస్ మార్కెట్ చాలా కీలకం. అందునా మన తెలుగు సినిమాకి అమెరికాలో భారీ మార్కెట్ ఉంటుంది. అందుకే మన హీరోలు, దర్శక, నిర్మాతలు అక్కడ ఉన్న మన వాళ్ళని దృష్టిలో పెట్టుకొనే సినిమాలను కూడా ప్లాన్ చేసుకుంటారు. ఇంకా చెప్పాలంటే.. తెలుగు రాష్ట్రాలలో ఒక ప్రాంతంతో పోటీగా అమెరికాలో మన సినిమాలు కలెక్షన్లను రాబడతాయి. ఇప్పటికే బాహుబలి సినిమా యూఎస్ మార్కెట్ లో భారీ రికార్డులను నెలకొల్పింది.

Neha Sharma: చెలరేగిపోతున్న బాఘ‌ల్ పూర్ భామ నేహా!

అయితే, ఇప్పుడు బిగ్గెస్ట్ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్ సినిమాకి ఇక్కడ టికెట్ల రేట్లు తగ్గించారు. ప్రీమియర్ సహా యూఎస్ లో అన్ని షోలకు ఒకే ధరను నిర్ధారించారు. ఇది బాహుబలి రెగ్యులర్ షోలకంటే కూడా తక్కువ ధరగా నిర్ణయించారు. తెలుగు వెర్షన్ సినిమాకు ఇక్కడ థియేటర్లలో పెద్దలకు 23 డాలర్లు, పిల్లలకు 18 డాలర్లు నిర్ణయించగా.. ఎక్స్ డీ, ఆర్పీఎక్స్, పీఎల్ఎఫ్ స్క్రీన్ వంటి పెద్ద ఫార్మెట్ లో పెద్దలకు 27 డాలర్లు, పిల్లలకు 20 డాలర్లు.. ఐమాక్స్, డీబాక్స్, డాల్బీ సినిమాస్ లో పెద్దలకు 30 డాలర్లు, పిల్లలకు 23 డాలర్లుగా నిర్ణయించారు.

Akhanda: బాలయ్య ఫ్యాన్స్ కు ఊరట.. అదిరే ట్రీట్ వచ్చేస్తుంది

ఇక, మిగతా హిందీ, తమిళం, కన్నడం, మలయాళం భాషల్లో పెద్దలకు 16 డాలర్లు, పిల్లలకు 12 డాలర్ల ధర నిర్ణయించారు. అమెరికాలో ఆర్ఆర్ఆర్ సినిమాని సరిగమ సినిమాస్, రాప్తార్ క్రియేషన్స్ సంయుక్తంగా 40 కోట్లకు దక్కించుకున్నారు. కాబట్టి, ఇక్కడ బ్రేక్ ఈవెన్ 11 మిలియన్ డాలర్లు వసూళ్లు చేయాలి. గతంలో ప్రీమియం ధరలు ఎక్కువగా ఉండడంతో బాహుబలి ఈ బ్రేక్ ఈవెన్ వసూళ్లను దక్కించుకోగా.. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ ఈ ధరలతో బ్రేక్ ఈవెన్ అందుకుంటుందా అన్న చర్చ జరుగుతుంది.

Anubhavinchu Raja: రిలీజ్ డేట్ ఫిక్స్.. రాజ్‌తరుణ్ ట్రాక్‌లో పడతాడా?

ఆర్ఆర్ఆర్ సినిమా అమెరికా కాదు మరో దేశం కాదు.. ఎక్కడ చూసినా ఈ సినిమాకి భారీ క్రేజ్ నెలకొంది. ఎన్టీఆర్-రామ్ చరణ్ లాంటి ఇద్దరు క్రేజీ స్టార్ హీరోలు, అలియా, అజయ్ దేవగన్ లాంటి బాలీవుడ్ స్టార్స్ ఉండడం కూడా ఈ సినిమాకి అదనపు అట్రాక్షన్. అయినా.. అమెరికాలో టికెట్ల ధరలను తగ్గించడం ఏంటన్నది ఇప్పుడు ట్రేడ్ వర్గాలలో జరిగే చర్చ.