Samantha: ఇప్పుడు సంతోషించు.. రేపటి కోసం పోరాడు.. సామ్ కొత్త లెస్సన్స్!

సినిమాలున్నా.. లేకపోయినా ఎప్పుడూ హెడ్ లైన్స్ లో ఉండటం సమంతాకు అలవాటే. కాకపోతే గతం వేరు.. ప్రస్తుతం వేరు. చై నుంచి సపరేటయిన తర్వాత సామ్ ఎక్కువగా నెగెటివ్ వార్తల్లోనే నానింది...

Samantha: ఇప్పుడు సంతోషించు.. రేపటి కోసం పోరాడు.. సామ్ కొత్త లెస్సన్స్!

Samantha

Samantha: సినిమాలున్నా.. లేకపోయినా ఎప్పుడూ హెడ్ లైన్స్ లో ఉండటం సమంతాకు అలవాటే. కాకపోతే గతం వేరు.. ప్రస్తుతం వేరు. చై నుంచి సపరేటయిన తర్వాత సామ్ ఎక్కువగా నెగెటివ్ వార్తల్లోనే నానింది. అందుకే ఆ నెగెటివిటీ నుంచి బయటపడటానికి ఆధ్యాత్మిక యాత్రలు చేస్తోంది. అంతేకాదు ఇప్పుడు ఉన్నవాటికి సంతోషించు.. రేపు కావాలనుకుంటున్న దానికోసం పోరాడు అని కొత్త పాఠాలు చెప్తోంది సామ్.

Radhe Shyam Teaser: రాధేశ్యామ్ టీజర్.. అంతర్లీనంగా కథను చెప్పిన మేకర్స్!

మొత్తానికి సమంత చార్ధామ్యాత్ర ముగిసింది. కొన్ని రోజులుగా హిమాలయాల్లో సేద తీరుతున్న సామ్.. ఇక వాటికి బైబై చెప్పేసింది. చైతూతో విడాకుల తర్వాత సమంత డిప్రెషన్ కి గురైందని.. ఆ బాధలోంచి బయటపడేందుకే ఇలా డివోషనల్ టూర్ వేసినట్టు ఆమె ఫ్రెండ్స్ చెప్తున్నారు. డైవర్స్ అనౌన్స్ మెంట్ కి కొన్ని రోజుల ముందు కూడా సామ్ఇలానే తిరుపతి, శ్రీకాళహస్తి ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేసింది. ఇక రీసెంట్ గా యమునోత్రి నుంచి మొదలైన సామ్ చార్ధామ్యాత్రలో గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ ఆలయాలను దర్శించుకుంది. అక్కడి మూమెంట్స్ ను ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంది కూడా.

Uppena 2: ఉప్పెనకి సీక్వెల్.. పాన్ వరల్డ్ కథంటున్న బుచ్చిబాబు

బెస్ట్ ఫ్రెండ్, డిజైనర్ శిల్పారెడ్డి.. ఈ డివోషనల్ టూర్ లో సామ్ కి తోడుగా ఉంది. స్పెషల్ హెలికాప్టర్ జర్నీ నుంచి గంగా హారతి, ప్రత్యేక పూజల్లో సామ్ కు గట్టి సపోర్ట్ నిచ్చింది. రిషికేశ్ లో మహర్షి మహేశ్ యోగి ఆశ్రమాన్ని కూడా సందర్శించింది సామ్ బ్యాచ్. చార్ ధామ్టూర్ గురించి సమంత ఓ పోస్ట్ చేస్తూ.. ‘మహాభారతం చదివినప్పటి నుంచి ఈ భూమ్మీద స్వర్గం హిమాలయాల్లో గడపాలని అనుకున్నాను. ఇప్పుడు నా కల నిజమైంది. నా హృదయంలో హిమాలయాలకు ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుందని రాసుకొచ్చింది.

Venu Swamy: రకుల్‌కు షాక్.. ప్రేమ విఫలమవుతుందని చెప్పిన వేణుస్వామి!

సామ్ ఆధ్యాత్మిక చింతనను ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు ఆమె ఫ్రెండ్స్. తప్పేమి లేకపోయినా సామ్ పై అనవసర పుకార్లు పుట్టించారు.. ఇప్పుడు ఇలా అయిన ఆమె అన్ని మర్చిపోయి చిల్ అవుతే చాలని వెనకేసుకొస్తున్నారు. సామ్ చేసిన పోస్ట్ లకు వెంకటేశ్ కూతురు ఆశ్రిత, కంగనా రనౌత్ వంటివారు వావ్ అంటూ స్పందించారు. పాస్ట్ ను మడతపెట్టి విసిరేసి ఫ్యూచర్ లో తానెంటో ప్రూవ్ చేసుకోవాలనేది సామ్ ప్లాన్. కెరీర్ పై ఫుల్ ఫోకస్ చేసిన సమంతా.. బ్యాక్ టూ బ్యాక్ సినిమా షూటింగ్స్ తో బిజీ కానుంది. ఇప్పటికే ఆమె నటించిన శాకుంతలం, కాతువాకుల రెండు కాధల్ సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి.