Priyanka Jawalkar : విజయ్ దేవరకొండ హీరోయిన్‌కి, ఆ యువ క్రికెటర్‌కి మధ్య ఏముంది?

ప్రియాంక సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు కొత్త ఫోటోలు పోస్ట్ చేస్తూ ఉంటుంది. తాజాగా తను పోస్ట్ చేసిన ఫోటోలు, దానికి ఓ యువ క్రికెటర్ ఇచ్చిన కామెంట్స్, దానికి........

Priyanka Jawalkar : విజయ్ దేవరకొండ హీరోయిన్‌కి, ఆ యువ క్రికెటర్‌కి మధ్య ఏముంది?

Priyanka

 

Venkatesh Iyer :  విజయ్ దేవరకొండ సరసన టాక్సీవాలాలో నటించిన ప్రియాంకా జవాల్కర్ అచ్చ తెలుగమ్మాయి. షార్ట్ ఫిలిమ్స్ తో కెరీర్ ని మొదలు పెట్టి టాక్సీవాలాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి SR కల్యాణ మండపం, తిమ్మరుసు వంటి సినిమాలతో మెప్పించింది. ప్రస్తుతం ప్రియాంకా చేతిలో మరో రెండు సినిమాలు ఉన్నాయి. ఇక ప్రియాంక సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు కొత్త ఫోటోలు పోస్ట్ చేస్తూ ఉంటుంది. తాజాగా తను పోస్ట్ చేసిన ఫోటోలు, దానికి ఓ యువ క్రికెటర్ ఇచ్చిన కామెంట్స్, దానికి ప్రియాంక ఇచ్చిన రిప్లైలు వైరల్ అవుతున్నాయి.

హీరోయిన్స్ తో క్రికెటర్స్ ప్రేమాయణం, రొమాన్స్ కొత్తేమి కాదు. చాలా మంది క్రికెటర్స్ హీరోయిన్స్ ని పెళ్లి ళ్లు కూడా చేసుకున్నారు. తాజాగా ఈ టాలీవుడ్‌ బ్యూటీ ప్రియాంకా జవాల్కర్‌ ఇటీవల క్రీమ్‌ కలర్‌ షోల్డర్‌ కట్‌ టాప్‌ ధరించి ఓ ఫొటోషూట్ చేసి ఫోటోలు తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. దీనికి యంగ్‌ క్రికెటర్‌ వెంకటేశ్‌ అయ్యర్‌ ‘క్యూట్‌’ అంటూ కామెంట్‌ చేశాడు. అతడి కామెంట్‌కు ప్రియాంక ‘హు? యూ?’ అంటూ రిప్లై ఇచ్చింది. ఆ తర్వాత కూడా మరికొన్ని కామెంట్స్ సాగాయి.

Kallapu Kushitha : లేట్ హవెర్స్ పబ్‌లో ఉండటం మా తప్పు కాదు.. దయచేసి మమ్మల్ని బద్నాం చేయకండి..

ఇక ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. మీమర్స్ అంతా ఈ కామెంట్స్‌తో మీమ్స్ చేసి మరింత వైరల్ చేశారు. వీరిద్దరి మధ్య ఏదో ఉంది అంటూ నెటిజన్లు అనుకుంటున్నారు. ఇదే విషయాన్ని కింద కామెంట్స్ లో కూడా అడుగుతున్నారు నెటిజన్లు. మీ ఇద్దరు ఒకర్నొకరు ఫాలో అవుతున్నారు, మీ ఇద్దరి మధ్య ఏదో జరుగుతుంది, చెప్పండి అంటూ కామెంట్స్ పెడుతున్నారు. తంలో కూడా వీరి మధ్య ఏమైనా ఉందా అనేలా కామెంట్స్ నడిచాయి. వెంకటేశ్ ఫొటోలకి, వీడియోలకు ప్రియాంకా కూడా గతంలో కామెంట్స్ చేసింది. మరి వీరిద్దరి మధ్య నిజంగా ఏదైనా ఉందా? లేక క్యాజువల్ గానే మాట్లాడుకుంటున్నారా తెలియాలి. మొత్తానికి రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో ప్రియాంకా జవాల్కర్, వెంకటేష్ అయ్యర్ మాత్రం హడావిడి చేస్తున్నారు.