Telugu Film Release Clash: ఎక్కువైపోయిన సినిమాల స్టాక్.. థియేటర్లేమో లేవాయే!

సినిమాలు వన్ బై వన్ కంప్లీట్ చేస్తున్నారు. అందరూ రిలీజ్ కి రెడీ అవుతున్నారు. వరుస పెట్టి రిలీజ్ డేట్స్ కూడా అనౌన్స్ చేస్తున్నారు. కానీ అసలు సినిమాలు రిలీజ్ చెయ్యడానికి డేట్స్...

Telugu Film Release Clash: ఎక్కువైపోయిన సినిమాల స్టాక్.. థియేటర్లేమో లేవాయే!

Telugu Film Release Clash (1)

Telugu Film Release Clash: సినిమాలు వన్ బై వన్ కంప్లీట్ చేస్తున్నారు. అందరూ రిలీజ్ కి రెడీ అవుతున్నారు. వరుస పెట్టి రిలీజ్ డేట్స్ కూడా అనౌన్స్ చేస్తున్నారు. కానీ అసలు సినిమాలు రిలీజ్ చెయ్యడానికి డేట్స్ ఎక్కడున్నాయి..? గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకు రావడానికి ధియేటర్లు ఎక్కడున్నాయి..? కోవిడ్ తో రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న సినిమాలన్నీ ఇప్పుడు లైనప్ అవుతున్నాయి. వరుసగా హీరోలందరూ రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేస్తున్నారు. అయితే అసలు సినిమాలు రిలీజ్ చెయ్యడానికి డేట్స్ ఎక్కడున్నాయి..? సినిమాల స్టాక్ ఎక్కువైపోవడంతో, అన్నీ ఒకేసారి రిలీజ్ కు రెడీ అవడంతో డేట్స్ అన్నీ బ్లాక్ అయిపోయాయి.

Chiru 154: పవన్ కాదు.. రవితేజనే చిరంజీవి తమ్ముడు!

లేటెస్ట్ గా నితిన్ తన అప్ కమింగ్ మాచర్ల నియోజకవర్గం సినిమాని ఏప్రిల్ 29న రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. డైహార్డ్ ఫ్యాన్ అని నితిన్ చెప్పుకునే పవన్ కళ్యాణ్ మూవీ హరిహరవీరమల్లు కూడా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది. క్రిష్ డైరెక్షన్లో ఫోక్లోర్ కాన్సెప్ట్ లో తెరకెక్కుతున్న హరిహరవీరమల్లు సంక్రాంతి నుంచి ఏప్రిల్ 29కి రిలీజ్ డేట్ ఎప్పుడో ఫిక్స్ చేసుకుంది. మరి ఈ రెండు సినిమాలు ఆ రోజు రిలీజ్ అవుతాయా..? లేక ఏ సినిమా అయినా విత్ డ్రా అవుతుందా అని డైలమాలో ఉన్నారు ఫ్యాన్స్ .

Sobhita Dhulipala: ఓరచూపుతో గాలమేసే తెనాలి బ్యూటీ శోభితా!

ఏప్రిల్ లోనే మరో బిగ్గెస్ట్ క్లాష్ కూడా ఫేస్ చేస్తోంది టాలీవుడ్. ఏప్రిల్ 14న రెండు పాన్ ఇండియన్ మూవీస్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశాయి. ప్రభాస్-ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ సలార్ స్టార్ట్ చేసినప్పుడే రిలీజ్ డేట్ ఏప్రిల్ 14 అని అనౌన్స్ చేశారు. ఎప్పటి నుంచో రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న ప్రశాంత్ నీల్ మరో పాన్ ఇండియా మూవీ కెజిఎఫ్ 2 కూడా.. వేరే సీజన్ లేకపోవడంతో అదే రోజు రిలీజ్ డేట్ అనౌన్స్ చేసుకుంది. ఈరెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయితే సౌత్ లోనే బిగ్గెస్ట్ క్లాష్ అవ్వడం ఖాయమంటున్నారు ఫ్యాన్స్ .

Nora Fatehi: దేవకన్యవో.. అప్సరసవో నువ్వు మనోహరి!

రవితేజ, అడవిశేష్ కూడా ఒకే రోజు రిలీజ్ డేట్స్ ఫిక్స్ చేసుకున్నారు. కోవిడ్ కన్నా ముందే రిలీజ్ అవ్వాల్సిన మేజర్ సినిమా.. ఇన్నాళ్లకు ఫిబ్రవరి 11న థియేటర్లోకి వస్తున్నామంటూ మొన్నీమధ్యే డేట్ అనౌన్స్ చేస్తే.. లేటెస్ట్ గా మాస్ మహారాజా రవితేజ కూడా ఇప్పటికే రిలీజ్ లేట్ అవ్వడంతో ఫిబ్రవరి 11నే రిలీజ్ ఫిక్స్ చేసుకుంది.

Bigg Boss 5: ఈ వారం ఎలిమినేషన్ అయ్యే కంటెస్టెంట్ ఈమెనే?

నెక్ట్స్ ఇయర్ నాటికి ఈక్వేషన్స్ అటు ఇటూ అవ్వొచ్చేమో కానీ.. ఈ సంవత్సరం డిసెంబర్ లోనే అసలు డేట్స్ లేక.. ఒకే రోజు రిలీజ్ చేస్తున్నారు నాని, అఖిల్. అఖిల్ సురేందర్ రెడ్డి కాంబినేషన్లో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ ఏజెంట్.. డిసెంబర్ 24న రిలీజ్ చేస్తున్నట్టు సినిమా అనౌన్స్ చేసినప్పుడే క్లారిటీ ఇచ్చారు. అయితే నాని కూడా శ్యామ్ సింగరాయ్ సినిమాని డిసెంబర్ 24నే రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. ఇలా సీజన్స్ అయిపోవడం, రిలీజ్ కి వేరే డేట్స్ లేకపోవడంతో.. ఒకే రోజు రిలీజ్ క్లాషెస్ ఫేస్ చెయ్యబోతున్నారు హీరోలు.