తెలుగు వారి అభిమాన కథానాయిక సౌందర్య జయంతి..

  • Edited By: sekhar , July 18, 2020 / 07:18 PM IST
తెలుగు వారి అభిమాన కథానాయిక సౌందర్య జయంతి..

మహానటి సావిత్రి తర్వాత తెలుగు వారిని అంత బాగా ఆకట్టుకున్న కథానాయిక సౌందర్య. తెలుగులో దాదాపు అగ్ర హీరోలందరి సరసనా నటించి స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన సౌందర్య 2004లో ఓ విమాన ప్రమాదంలో మరణించారు. జూలై 18న(శనివారం) సౌందర్య జయంతి.

Soundaryaఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, సౌందర్య అభిమానులు ఆమెను జ్ఞాపకం చేసుకుంటూ సోషల్ మీడియాలో సౌందర్య ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. యువ కథానాయకుడు మంచు మనోజ్ కూడా సోషల్ మీడియా ద్వారా సౌందర్యకు నివాళులర్పించాడు.

Soundarya

‘సౌందర్యగారి జయంతి సందర్భంగా ఆమెను గుర్తు చేసుకుంటున్నాను. మీరు అద్భుతమైన నటి, గొప్ప వ్యక్తిత్వం గల మనిషి. మిమ్మల్ని మిస్ అవుతున్నా సినీ అమ్మా. మీరు ఎక్కడున్నా ప్రశాంతంగా ఉండాలి’ అంటూ మంచు మనోజ్ ట్వీట్ చేశాడు. సౌందర్య, మోహన్ బాబు సరసన ‘గౌరిశంకర్’ చిత్రంలో నటిస్తుండగానే తనువు చాలించారు.