అకీరా నందన్ కొ.ణి.దె.ల.. – వైరల్ అవుతున్న పిక్

లిటిల్ పవర్ స్టార్ హీరోగా ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడోనని ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు పీకే ఫ్యాన్స్.

  • Published By: sekhar ,Published On : January 28, 2019 / 06:49 AM IST
అకీరా నందన్ కొ.ణి.దె.ల.. – వైరల్ అవుతున్న పిక్

లిటిల్ పవర్ స్టార్ హీరోగా ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడోనని ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు పీకే ఫ్యాన్స్.

అకీరా నందన్ కొణిదెల… వినయ విధేయ రామలో రామ్ చరణ్, రామ్.. కొ.ణి.దె.ల… అని కదా చెప్పాడు, మరీ కొత్త పేరేంటి అనుకుంటున్నారా? అకీరా నందన్ పేరింకా గుర్తుపట్టలేదా? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి, భార్య రేణు దేశాయ్‌తో అకీరా నందన్, ఆద్య అనే ఇద్దరు పిల్లలున్న సంగతి తెలిసిందే. పవన్ నుండి విడిపోయిన తర్వాత పిల్లలిద్దరూ రేణు దేశాయ్ దగ్గరే పెరుగుతున్నారు. రీసెంట్‌గా రేణు దేశాయ్, అకీరా నందన్, ఆద్యల లేటెస్ట్ పిక్స్ సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతున్నాయి. ఒక పిక్‌లో రేణు దేశాయ్ తన కూతురు ఆద్యతో కలిసి నవ్వులు చిందుస్తూ, ఫోటోకి పోజిచ్చింది. బ్యాక్ గ్రౌండ్ చూస్తుంటే ఏదో హిల్ స్టేషన్‌కి వెకేషన్‌కి వెళ్ళినట్టుంది. ఇక అకీరా నందన్ సోలో పిక్ అయితే అదిరి పోయిందనే చెప్పాలి. 

ఆ పిక్‌లో జీన్స్ షర్ట్‌లో, హెడ్ ఫోన్స్ పెట్టుకుని మ్యూజిక్ ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు అకీరా.. సైడ్‌కి చూస్తూ ఉన్న అకీరా మాచో లుక్.. కిరాక్ ఉంది. అకీరా, ఆద్య ఇద్దరూ చాలా ఫాస్ట్‌గా ఎదిగి పోయినట్టున్నారు. అకీరా పిక్ చూసిన పవర్ స్టార్ ఫ్యాన్స్, హాలీవుడ్ హీరోలా ఉన్నాడనీ, తనకి హీరోకుండాల్సిన లక్షాణాలున్నాయనీ, స్టైలింగ్‌లో పవన్‌ని గుర్తు చేస్తున్నాడనీ ఈ పిక్‌ని తెగ షేర్ చేసేస్తున్నారు. లిటిల్ పవర్ స్టార్ హీరోగా ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడోనని ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు పీకే ఫ్యాన్స్.