Akira Nandan: రేణూదేశాయ్-అకీరా నందన్‌కు కరోనా పాజిటివ్

కరోనా మరోసారి విపరీతంగా విస్తరిస్తోంది. సినీ సెలబ్రిటీలు ఒక్కొక్కరుగా కరోనా బారిన పడుతున్నారు.

Akira Nandan: రేణూదేశాయ్-అకీరా నందన్‌కు కరోనా పాజిటివ్

Corona

Akira Nandan: కరోనా మరోసారి విపరీతంగా విస్తరిస్తోంది. సినీ సెలబ్రిటీలు ఒక్కొక్కరుగా కరోనా బారిన పడుతున్నారు. ఈ క్రమంలోనే లేటెస్ట్‌గా పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్.. ప్రముఖ నటి రేణూ దేశాయ్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని రేణూ దేశాయ్ వెల్లడించారు.

కొన్ని రోజులు క్రితమే కోవిడ్ బారిన పడ్డామని, ఇప్పుడే కోలుకుంటున్నట్టు ఇన్‌స్టాగ్రమ్ ద్వారా తెలియజేశారు రేణూదేశాయ్. రెండు డోసుల కరోనా వ్యాక్సిన్ తీసుకున్నా కూడా కరోనా సోకినట్లుగా రేణూ దేశాయ్ చెప్పారు. ఇక తన తనయుడు అకిరా నందన్‌కు వ్యాక్సిన్ వేయించాలని అనుకునేలోపే పాజిటివ్‌ వచ్చినట్లు చెప్పారు రేణూదేశాయ్.

ఇప్పటికే పలువురు సినీ సెలబ్రిటీలు మహేష్ బాబు, తమన్, రాజేంద్ర ప్రసాద్, బండ్ల గణేష్, త్రిష, వరలక్ష్మి శరత్ కుమార్, ఖుష్బూ, శోభన వంటివారికి కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే.