Renu Desai: టైగర్ నాగేశ్వర్ రావు కోసం ముగించేసిన హేమలతా లవనం..!
ఒకప్పటి హీరోయిన్ రేణు దేశాయ్ మళ్లీ సినిమాల్లో ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. బద్రి, జానీ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాల్లో నటించిన ఈ హీరోయిన్, ఇప్పుడు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటించేందుకు రెడీ అయ్యింది. ఇప్పటికే మాస్ రాజా రవితేజ నటిస్తున్న ది మోస్ట్ వెయిటెడ్ పాన్ ఇండియా మూవీ ‘టైగర్ నాగేశ్వర్ రావు’ ప్రేక్షకుల్లో ఎలాంటి హైప్ క్రియేట్ చేసిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ సినిమాను దర్శకుడు వంశీ తెరకెక్కిస్తుండగా, రవితేజ ఈ సినిమాలో పవర్‌ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు.

Renu Desai: ఒకప్పటి హీరోయిన్ రేణు దేశాయ్ మళ్లీ సినిమాల్లో ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. బద్రి, జానీ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాల్లో నటించిన ఈ హీరోయిన్, ఇప్పుడు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటించేందుకు రెడీ అయ్యింది. ఇప్పటికే మాస్ రాజా రవితేజ నటిస్తున్న ది మోస్ట్ వెయిటెడ్ పాన్ ఇండియా మూవీ ‘టైగర్ నాగేశ్వర్ రావు’ ప్రేక్షకుల్లో ఎలాంటి హైప్ క్రియేట్ చేసిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ సినిమాను దర్శకుడు వంశీ తెరకెక్కిస్తుండగా, రవితేజ ఈ సినిమాలో పవర్‌ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు.
Renu Desai: రవితేజకు బూస్ట్ ఇచ్చే పాత్రలో రేణు దేశాయ్
ఇక ఈ సినిమాలో హేమలత లవనం అనే పాత్రలో రేణు దేశాయ్ నటిస్తోంది. ఆమె పాత్రకు సంబంధించిన ప్రీలుక్ పోస్టర్‌ను గతంలోనే రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో రేణు దేశాయ్ పాత్ర కూడా పవర్‌ఫుల్‌గా ఉండబోతున్నట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి. కాగా, తాజాగా రేణు దేశాయ్ తన పాత్రకు సంబంధించిన షూటింగ్ పార్ట్‌ను ముగించేసినట్లుగా చిత్ర యూనిట్ తెలిపింది.
Renu Desai: హేమలతా లవణం పాత్రలో రేణు దేశాయ్ రీఎంట్రీ అదిరిందిగా!
ఈ సినిమాలో రేణు దేశాయ్ పాత్ర సినిమాకు కీలకంగా ఉండబోతుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఈ మూవీలో రవితేజ పాత్ర మునుపెన్నడూ చూడని విధంగా, పవర్‌ప్యాక్డ్‌గా డిజైన్ చేశారట చిత్ర యూనిట్. ఇక ఈ సినిమాలో నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్‌లు హీరోయిన్లుగా నటిస్తుండగా, జివి.ప్రకాశ్ కుమార్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తుండగా, పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా రానుంది.
View this post on Instagram