RGV : ట్రిపుల్ ఆర్ ఫ్రెండ్‌షిప్ ఫిలిం.. ఇది అడల్ట్ సినిమా కాదు..

ప్రెస్‌మీట్ లో ఆర్జీవీ మాట్లాడుతూ.. ''డేంజరెస్ సినిమా అడల్డ్ కంటెంట్ అనుకొవద్దు. లెస్బియన్స్ కూడా మనలాంటి మనుషులే. వారి ప్రేమ‌, అభిప్రాయాలను యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం ఉంది.....

RGV : ట్రిపుల్ ఆర్ ఫ్రెండ్‌షిప్ ఫిలిం.. ఇది అడల్ట్ సినిమా కాదు..

Dangerous

Dangerous :  ఆర్జీవీ గత కొంతకాలంగా డిఫరెంట్ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ లెస్బియన్ కథతో రాబోతున్నారు. నైనా గంగూలీ, అప్సర రాణి హీరోయిన్స్ గా లెస్బియన్ స్టోరీతో కొత్తగా సినిమా తీస్తున్నారు ఆర్జీవీ. ఈ సినిమాకి ప్రమోషన్స్ కూడా బాగానే చేస్తున్నారు. ‘డేంజరస్’ అనే టైటిల్ తో ఈ సినిమాని తెరకెక్కించారు. అయితే ఇప్పుడు దీనిని పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేయబోతున్నారు. దీనికి తెలుగులో ‘మా ఇష్టం’ అనే టైటిల్ ని పెట్టారు.

Sai Pallavi : వ్యవసాయ కూలీగా మారిన స్టార్ హీరోయిన్

ఈ సినిమా తెలుగు ప్రమోషన్స్ లో భాగంగా ఆర్జీవీ తాజాగా ప్రసాద్ ల్యాబ్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్‌మీట్ లో ఆర్జీవీ మాట్లాడుతూ.. ”డేంజరెస్ సినిమా అడల్డ్ కంటెంట్ అనుకొవద్దు. లెస్బియన్స్ కూడా మనలాంటి మనుషులే. వారి ప్రేమ‌, అభిప్రాయాలను యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ట్రిపుల్ ఆర్‌లో చరణ్, తారక్ లిప్‌లాక్ పెట్టుకుంటే అది గే ఫిలిం అవుతుంది. లిప్‌లాక్ లేదు కాబట్టే అది ఫ్రెండ్‌షిప్ ఫిలిం అయింది. లిప్‌లాక్ ఉన్నా లేకున్నా స్టోరీ మారదు. డేంజరస్ సినిమా కోసం అప్సర, నైనా వారి పెరెంట్స్ తో మాట్లాడి ఈ సినిమా చేశారు. ఇది రెగ్యులర్ కధే. ఇందులో ఇద్దరు అమ్మాయిల మధ్య ప్రేమ ఉండటమే కొత్తదనం” అని తెలిపారు.