RGV : నా డేంజరస్ సినిమాని కుట్ర పన్ని ఆపారు

ఇటీవల ఆర్జీవీ తీసిన డేంజరస్ సినిమా రిలీజ్ అవ్వకుండా కొంతమంది అడ్డుకున్నారు. ఈ సినిమా టైంలో నట్టి కుమార్ ఆర్జీవీపై పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రెస్ మీట్స్ పెట్టి ఆర్జీవిని........

RGV : నా డేంజరస్ సినిమాని కుట్ర పన్ని ఆపారు

Rgv

RGV :  ఇటీవల ఆర్జీవీ తీసిన డేంజరస్ సినిమా రిలీజ్ అవ్వకుండా కొంతమంది అడ్డుకున్నారు. ఈ సినిమా టైంలో నట్టి కుమార్ ఆర్జీవీపై పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రెస్ మీట్స్ పెట్టి ఆర్జీవిని విమర్శించారు. డేంజరస్ సినిమా రిలీజ్ అవ్వకుండా కోర్టులో కేసు వేశారు. దాంతో సినిమా రిలీజ్ ఆగిపోయింది. తాజాగా ఈ సినిమా ఆగిపోవడంపై ఆర్జీవీ ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు.

ఇందులో ఆర్జీవీ.. ”గత కొద్ది రోజులుగా మీడియాలో వస్తున్న నట్టి కుమార్, నట్టి క్రాంతి, నట్టి కరుణల విషయంపై ఇప్పుడు నేను క్లారిటీ ఇస్తున్నాను. ఏప్రిల్ 8, 2022న మూడు బాషల్లో రిలీజ్ కి సిద్దంగా ఉన్న నా డేంజరస్ సినిమాని ఆపటానికి నట్టి క్రాంతి,నట్టి కరుణలు కుట్ర పన్ని, ఫోర్జరీ చేసిన డాక్యుమెంట్ ఆధారంగా 5వ జూనియర్ సివిల్ జడ్జి, సిటీ సివిల్ కోర్టులో పిటీషన్ ఫైల్ చేసి చిత్రాన్ని అడ్డుకున్నారు. ఆ కోర్టు ఇచ్చిన ఇంజన్క్షన్ ఆర్డర్ ని ఇప్పుడు తెలంగాణ హైకోర్టు సస్పెండ్ చేసింది”

”నేను ఇప్పుడు నట్టి క్రాంతి, నట్టి కరుణల మీద ఫోర్జరీకి సంభందించిన కేసే కాకుండా, వివిధ మీడియా ఛానళ్లలో నాపై చేసిన నిందలు, ఆరోపణలకు సంబంధించి నట్టి క్రాంతి,నట్టి కరుణల ఫాదర్ అయినటువంటి నట్టి కుమార్ మీద నేను, సినిమా నిర్మాత తుమ్మలపల్లి రామత్యనారాయణ గారు డిఫమేషన్ కేసు వెయ్యటమే కాకుండా రిలీజ్ కి ముందు ఫోర్జరీ డాక్యుమెంట్ ని ఉపయోగించి సినిమాని ఆపి మాకు అపారమైన ఆర్థిక నష్టం కలిగించినందుకు కూడా వాళ్ల మీద డ్యామేజ్ కేసు వెయ్యబోతున్నాము.”

 

Vijay Father : ‘బీస్ట్’ సినిమాలో స్క్రీన్‌ప్లే అస్సలు బాలేదు

”ఇప్పుడు విడుదల చేసేందుకు క్లియరెన్స్‌ ఆర్డర్ వచ్చింది కనుక డేంజరస్ చిత్రాన్ని May 6న విడుదల చెయ్యబోతున్నాము. దానికి సంభందించి మాకు జారీ చేసిన సెన్సార్ సర్టిఫికెట్ లు కూడా పబ్లిక్ డొమైన్ లో పెడుతున్నాము. ఫోర్జరీ చేసి, దానిని నిజమైన డాక్యుమెంట్‌గా ఉపయోగించడం ద్వారా నట్టి క్రాంతి, నట్టి కరుణలు చేసిన క్రిమినల్ చర్యలకి సంబంధించిన విషయాలు, అలాగే పైన పేర్కొన్న ఇంజన్క్షన్ ఆర్డర్‌ను నట్టిలు సేకరించిన విధానాన్ని, యంత్రాంగాన్ని దుర్వినియోగ పరుచుకున్న తీరు నట్టి ఫ్యామిలీ యొక్క నేరపూరిత స్వభావాన్ని తెలియజేస్తుంది. ఇక ఈ ప్రెస్ నోట్ తప్ప, ఇకపై నేను ఈ విషయంపై ఇంకేం మాట్లాడబోను. కేవలం వాళ్ల పైన చట్టపరమైన చర్యలపై మాత్రమే దృష్టి పెడతాను. అతి త్వరలో వాళ్ల అసలు రూపం బయట పడబోతోంది” అంటూ తెలిపారు. మరి ఈ సారైనా ఆర్జీవీ డేంజరస్ సినిమా రిలీజ్ అవుతుందా లేదా మారేదన్నా వివాదంలో ఇరుక్కుంటుందా చూడాలి.