RGV: శ్రీరెడ్డి చీరవిప్పి రోడ్డెక్కినపుడే తెలిసింది.. ‘మా’ అనేది ఉందని!

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA) ఎన్నికలు ఎంత హైప్ క్రియేట్ చేశాయి.. ఎలా జరిగాయి.. ఏ పరిస్థితుల్లో జరిగాయి.. ఎందుకు జరిగాయో అందరికీ తెలిసిందే. ఎలాగైతేనేం చివరకు నూతన అధ్యక్షుడిగా..

RGV: శ్రీరెడ్డి చీరవిప్పి రోడ్డెక్కినపుడే తెలిసింది.. ‘మా’ అనేది ఉందని!

Rgv

RGV: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA) ఎన్నికలు ఎంత హైప్ క్రియేట్ చేశాయి.. ఎలా జరిగాయి.. ఏ పరిస్థితుల్లో జరిగాయి.. ఎందుకు జరిగాయో అందరికీ తెలిసిందే. ఎలాగైతేనేం చివరకు మా నూతన అధ్యక్షుడిగా మంచు విష్ణు ప్రమాణ స్వీకారం కూడా చేశాడు. ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి గెలిచిన వారంతా కూడా మూకుమ్మడి రాజీనామా చేయగా.. వాటిని ఆమోదించారా లేదా అన్నది ఎవరికీ తెలియదు. మరోవైపు ప్రకాష్ రాజ్ ఈ ఎన్నికలపై ఇప్పటికీ సీసీ కెమెరా దృశ్యాలు చూడాలి.. ఎన్నికల అధికారే అంతా చేసారానేలా మాట్లాడుతూనే ఉన్నారు.

RGV: అమ్మాయిలంటే ఇష్టం.. లెస్బియన్స్ అమ్మాయిలంటే ఇంకా ఇష్టం!

కాగా, మా ఎన్నికలపై సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అంతే సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు మాకు బిల్డింగ్ ఎందుకో.. ఎన్నికలు ఎందుకో అని ప్రశ్నించిన వర్మ తనకు శ్రీరెడ్డి చీరవిప్పి రోడెక్కే వరకు తనకు మా అనేది ఒకటి ఉందని కూడా తెలియదన్నారు. శ్రీరెడ్డి మూలంగానే తనకు మా ఉందని తెలిసిందని.. మొన్నటి మా ఎన్నికలను చూసి కామెడీగా, అసహ్యంగా అనిపించిందన్నారు. అసలు ఇంత రాద్ధాంతం చేసి ఈ ఎన్నికలలో పాల్గొనేందుకు ఇందులో ఏముందో కూడా ఇప్పటికీ తనకి అర్ధం కావడం లేదన్నారు.

RGV: ఆరు వందల ఓట్ల కోసం జీరోలైన హీరోలు.. మాపై వర్మ!

ఇక, ప్రకాష్ రాజ్ నాన్ లోకల్ అంశంపై స్పందించిన వర్మ.. ప్రకాష్ రాజ్ ఇన్నేళ్లు సినిమా ఇండస్ట్రీలో ఇన్ని వందల సినిమాలు చేశాక.. ఇప్పుడు లోకల్ నాన్ లోకల్ లెగసీని తీసుకురావడం జస్ట్ వాళ్ళ దృష్టిలో పదవి కోసమేనన్నారు. ఇక మాను సర్కస్.. సభ్యులను జోకర్లుగా పోల్చిన వర్మ ట్వీట్ కు మంచు మనోజ్ కౌంటర్ వేసిన సంగతి తెలిసిందే. అయితే.. అసలు మనోజ్ నన్ను రింగ్ మాస్టర్ గా ఎందుకు పోల్చాడో ఇప్పటికీ నాకు అర్ధం కావడం లేదని.. రింగ్ మాస్టర్ అంటే సర్కస్ ను కంట్రోల్ చేసేవాడని.. కానీ, నేను దానికి ఎలా ఫిట్ అవుతానో ఇప్పటికీ నాకు అర్ధం కావడం లేదన్నారు.