RGV (ఒక సైకో బయోపిక్) – టైటిల్ రిజెక్ట్

‘‘RGV (ఒక సైకో బయోపిక్)’’ టైటిల్‌ తిరస్కరించిన తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్..

  • Published By: sekhar ,Published On : January 31, 2020 / 02:48 PM IST
RGV (ఒక సైకో బయోపిక్) – టైటిల్ రిజెక్ట్

‘‘RGV (ఒక సైకో బయోపిక్)’’ టైటిల్‌ తిరస్కరించిన తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్..

కాంట్రవర్సీ కింగ్ రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరు నిత్యం ఏదో ఒక వివాదంలో వినబడుతూనే ఉంటుంది. ఏదైనా ఒక విషయాన్ని వివాదంగా మార్చడం వర్మకి వెన్నతో పెట్టిన విద్య.. ఇటీవల ‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’ సినిమాతో నానా రచ్చ చేసిన వర్మ గతకొద్ది రోజులుగా సైలెంట్‌గానే ఉంటున్నాడు.

ఇప్పుడు వర్మ పేరు తెరమీదకి ఎందుకు వచ్చిందంటే.. ‘‘RGV (ఒక సైకో బయోపిక్)’’ అనే టైటిల్‌తో సినిమా తీయడానికి తెలుగు ఫిలిం ఛాంబర్ అనుమతి నిరాకరించింది. ఈ మేరకు అధికారికంగా ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు.

‘‘RGV (ఒక సైకో బయోపిక్)’’ టైటిల్‌తో సినిమా తీయడానికి ఆ పేరు ప్రముఖ దర్శక, నిర్మాత రామ్ గోపాల్ వర్మ పేరు కావడం చేత వీలు పడదని, టైటిల్ ఆమోదం పొందాలంటే రామ్ గోపాల్ వర్మ దగ్గరినుండి NOC (No Objection Certificate) తీసుకోవాలని, దానిని ఛాంబర్ వారికి అందించాలని లేఖలో పేర్కొన్నారు. దీంతో వర్మ పేరుకున్న పవర్ ఏంటనేది తెలిసింది అంటున్నారు RGV ఏకలవ్య శిష్యులు.