RGV : ఆ సినిమాలకంటే పెద్ద హిట్ ఇది.. కార్తికేయ 2 హిట్ పై ఆర్జీవీ కామెంట్స్..

డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తాజాగా కార్తికేయ 2 సినిమా విజయంపై ట్వీట్ చేశాడు. వర్మ ఈ ట్వీట్ లో.. '' నిఖిల్ నటించిన కార్తికేయ 2 సినిమా రెండవ శుక్రవారం కూడా అమీర్ ఖాన్ లాల్ సింగ్ చడ్డా, అక్షయ్ కుమార్ రక్షాబంధన్ కంటే డబల్ కలెక్షన్స్ సాధించింది.........

RGV : ఆ సినిమాలకంటే పెద్ద హిట్ ఇది.. కార్తికేయ 2 హిట్ పై ఆర్జీవీ కామెంట్స్..

RGV Comments on Karthikeya 2 Movie

RGV :  చందూ మొండేటి దర్శకత్వంలో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన కార్తికేయ 2 సినిమా అనేక అడ్డంకుల్ని ఎదుర్కొని చిన్న సినిమాగా రిలీజై భారీ విజయం సాధించింది. నార్త్ లో అయితే కార్తికేయ 2 సినిమా రోజు రోజుకి మరింత విజయాన్ని సాధిస్తూ, థియేటర్స్ ని పెంచుకుంటూ కలెక్షన్స్ ని రాబడుతుంది. ఇప్పటికే 60 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసి నిఖిల్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

అయితే నార్త్ లో గత వారం స్టార్ హీరోలు అక్షయ్ కుమార్ రక్షా బంధన్, అమీర్ ఖాన్ లాల్ సింగ్ చడ్డా సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఆ సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో కార్తికేయ 2కి మరింత కలిసొచ్చింది. సినిమా రిలీజ్ అయి దాదాపు వారం రోజులు దాటినా నార్త్ లో స్టార్ హీరోల సినిమాల కంటే కూడా నిఖిల్ కార్తికేయ 2 సినిమా ఎక్కువ కలెక్షన్స్ ని కలెక్ట్ చేసింది. దీంతో సినీ ట్రేడ్ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి.

Sadaa : మీరెవరు నాకు పెళ్లి చేసుకోమని చెప్పడానికి.. నాకు కావాల్సిన వాడు ఎలా ఉండాలంటే.. పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన సదా..

ఈ విజయం పై నిఖిల్ ని, దర్శకుడు చందూ మొండేటిని, చిత్ర యూనిట్ ని ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీద ట్వీట్స్ వేయడానికి రెడీగా ఉండే డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తాజాగా కార్తికేయ 2 సినిమా విజయంపై ట్వీట్ చేశాడు. వర్మ ఈ ట్వీట్ లో.. ” నిఖిల్ నటించిన కార్తికేయ 2 సినిమా రెండవ శుక్రవారం కూడా అమీర్ ఖాన్ లాల్ సింగ్ చడ్డా, అక్షయ్ కుమార్ రక్షాబంధన్ కంటే డబల్ కలెక్షన్స్ సాధించింది. రాజమౌళి ఆర్ఆర్ఆర్, ప్రశాంత్ నీల్ కెజిఎఫ్ 2 కంటే ఇది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా” అని పోస్ట్ చేశారు. డైరెక్టర్ చందూ మొండేటి కంగ్రాట్స్ తెలిపారు. దీంతో ఆర్జీవీ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.