Tribal Sisters:: ఆర్జీవీ కూడా ఓ మనిషే..!

దేవుడంటే నమ్మకం లేదు.. సంసారమంటే అసలు చిరాకు.. జాలి, దయ, ధర్మం, మానవత్వం లాంటి లక్షణాలేవీ నాకు లేవని ఒకటి లక్షల సార్లు చెప్పుకున్న వ్యక్తి రామ్ గోపాల్ వర్మ. ఒక్క మాటలో చెప్పాలంటే సమాజంలో మనుషులంతా ఒకటైతే.. తానొక్కడినే ఒక టైపు అని చెప్పుకొనే వర్మ.. తానొక్కడే స్వతంత్రంగా బ్రతుకుతున్నానని కాలరెగరేసి మరీ చెప్పుకుంటారు.

Tribal Sisters:: ఆర్జీవీ కూడా ఓ మనిషే..!

Tribal Sisters

Tribal Sisters:: దేవుడంటే నమ్మకం లేదు.. సంసారమంటే అసలు చిరాకు.. జాలి, దయ, ధర్మం, మానవత్వం లాంటి లక్షణాలేవీ నాకు లేవని ఒకటి లక్షల సార్లు చెప్పుకున్న వ్యక్తి రామ్ గోపాల్ వర్మ. ఒక్క మాటలో చెప్పాలంటే సమాజంలో మనుషులంతా ఒకటైతే.. తానొక్కడినే ఒక టైపు అని చెప్పుకొనే వర్మ.. తానొక్కడే స్వతంత్రంగా బ్రతుకుతున్నానని కాలరెగరేసి మరీ చెప్పుకుంటారు. కానీ.. ఆయన ఎన్ని చెప్పినా ఆయన కూడా ఒక మనిషే.. అతనిలో కూడా మనుషులందరిలాగానే ఫీలింగ్స్ ఉంటాయి.

తానో పెద్ద క్రూరుడిగా మాట్లాడే వర్మలో కూడా జాలి, దయ వంటి గుణాలున్నాయి. మానవీయత కోణంలో కూడా వర్మ స్పందించగలరని నిరూపించారు. ఈ మధ్యనే అతి కిరాతకంగా ఇద్దరు గిరిజన యువతులను కొట్టి చంపిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. మధ్యప్రదేశ్‌లోని థార్‌ జిల్లా పిపల్వ గ్రామానికి చెందిన ఇద్దరు గిరిజన యువతులు మేనమామ కుమారులతో ఫోన్‌లో మాట్లాడారనే కారణంతో అత్యంత దారుణంగా కర్రలతో చితకబాదారు. ఆ కిరాతకాన్ని వీడియోలో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్‌గా మారింది.

ఆ దారుణ ఘటనకు చెందిన వీడియో చూసిన వర్మ ఊహించనివిధంగా రియాక్ట్ అయ్యారు. కాస్త ఎమోషనల్ అయిన వర్మ తన ఆవేదనను, ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. ఈ దారుణాన్ని తాను నమ్మలేకపోతున్నానన్న వర్మ దాడికి పాల్పడిన వాళ్లందరికీ తగిన శిక్ష వేయకపోతే తనకు ఈ దేశంపై నమ్మకం పోతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే.. వర్మలో కూడా ఇలా సామాజిక సృహ ఉంటుందా అని సోషల్ మీడియాలో నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా ఆ అక్కాచెల్లెళ్లపై దాడి చేసిన ప్రతిఒక్కరికి శిక్ష పడాల్సిందేనని దేశవ్యాప్తంగా డిమాండ్లు వినిపిస్తున్నాయి.