RGV Ladki : చైనా ఫిలిం ఫెస్టివల్ కి ఆర్జీవీ సినిమా

చైనా లోని ఫోషన్ కుంగ్ ఫు ఫిలిం ఫెస్టివల్ లో బ్రూస్ లీ జయంతి సందర్భంగా ఇండో-చైనీస్ ప్రొడక్షన్ లో రూపొందిన ఈ సినిమా స్పెషల్ ప్రీమియర్ కి సెలెక్ట్ అయింది. చైనాలో జరిగే ఈ ఫిలిం

RGV Ladki : చైనా ఫిలిం ఫెస్టివల్ కి ఆర్జీవీ సినిమా

Rgv Ladki

RGV Ladki :  ఆర్జీవీ ఏ సినిమా తీసినా సెన్సేషన్ సృష్టిస్తాడు. తన కొత్తరకం సినిమాలతో కొత్తగా ప్రమోషన్స్ చేసి ప్రతి సారి డిఫరెంట్ గా ప్లాన్ చేయడానికి ట్రై చేస్తాడు. ఆర్జీవీకి కాలేజీలో చదువుకునే రోజుల నుంచి బ్రూస్లీ అంటే ఇష్టమని చాలా సార్లు చెప్పాడు. బ్రూస్లీకి కనెక్ట్ అయ్యేలా ఒక్క సినిమా అయినా తీయాలి అనుకున్నాడు. ఇన్నాళ్ళకి ఆ సినిమా ఆర్జీవీ నుంచి రాబోతుంది. పూజ భలేకర్ హీరోయిన్ గా ఆర్జీవీ దర్శకత్వంలో ‘లడకీ’ అనే సినిమా రాబోతుంది.

Jai Bheem : 25 రోజుల్లో ‘జై భీమ్’ కోర్ట్ సెట్.. ఆశ్చర్యపోయిన తమిళనాడు హైకోర్ట్ సిబ్బంది

ఈ సినిమా ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ అయినా కరోనా వల్ల వాయిదా పడుతూ వస్తుంది. ఈ సినిమాని ఆర్జీవీ దర్శకత్వంలో ఆర్ట్ సి మీడియా – చైనా కు చెందిన బిగ్ పీపుల్ సంస్థలు కలిసి నిర్మించాయి. ఇది ఇండియాలోనే ఫస్ట్ రియలిస్టిక్ మార్షల్ ఆర్ట్స్ మూవీగా ఆర్జీవీ తెలిపాడు. ఇందులో ఫిమేల్ మార్షల్ ఆర్ట్స్ పర్సన్ పూజా భలేకర్ లీడ్ రోల్ పోషించింది. నిన్న ఈ సినిమా ట్రైలర్ ను వర్మ రిలీజ్ చేశారు.

Poonam Pandey : పూనమ్ పాండేను తీవ్రంగా కొట్టిన భర్త.. హాస్పిటల్లో పూనమ్

మార్షల్ ఆర్ట్స్ హీరో బ్రూస్ లీ స్ఫూర్తితో ఫైటర్ గా మారిన ఓ యువతి జీవితంలో జరిగే సంఘటనలతో ఈ సినిమాని ఆర్జీవీ తెరకెక్కించారు. ఈ సినిమాలో యాక్షన్ తో పాటు ప్రేమ, రొమాన్స్ కూడా ఎక్కువే ఉన్నాయి. పూజా భలేకర్ ఓ వైపు యాక్షన్ చేస్తూనే అందాలను కూడా చూపించింది. ఇందులో యాక్షన్ సీక్వెన్స్ ను పూజా – వర్మ కలిసి డిజైన్ చేశారు. బ్రూస్ లీ నటించిన ‘ఎంటర్ ది డ్రాగన్’ సినిమా స్పూర్తితో రామ్ గోపాల్ వర్మ ”లడకీ” చిత్రాన్ని తెరకెక్కించారు.

Lara Dutta : డేటింగ్‌ యాప్‌లో మాజీ మిస్‌ యూనివర్స్‌ ప్రోఫైల్‌

ఇండో – చైనీస్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘లడకీ’ సినిమాని డిసెంబర్ 10వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. తెలుగు, తమిళం, హిందీతో పాటు చైనీస్ భాషలో చైనాలో రిలీజ్ అవుతుంది. చైనాలో ఈ సినిమా ‘డ్రాగన్ గర్ల్’ అనే పేరుతో రిలీజ్ అవ్వనుంది. ఈ సినిమాని చైనా ఫిలిం గ్రూప్ కార్పొరేషన్ అనే డిస్ట్రిబ్యూషన్ సంస్థ అక్కడ 20 వేల థియేటర్స్ లో భారీగా విడుదల చేయబోతోందని రామ్ గోపాల్ వర్మ తెలిపారు. అంతే కాక బ్రూస్ లీ 81వ జయంతి సందర్భంగా దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫాలో నవంబర్ 27న ‘లడకీ’ సినిమా నుంచి స్పెషల్ పోస్టర్ ను విడుదల చేయబోతున్నారు. అలాగే చైనా లోని ఫోషన్ కుంగ్ ఫు ఫిలిం ఫెస్టివల్ లో బ్రూస్ లీ జయంతి సందర్భంగా ఇండో-చైనీస్ ప్రొడక్షన్ లో రూపొందిన ఈ సినిమా స్పెషల్ ప్రీమియర్ కి సెలెక్ట్ అయింది. చైనాలో జరిగే ఈ ఫిలిం ఫెస్టివల్ లో ‘లడకీ’ సినిమా త్వరలో ప్రదర్శించబోతున్నారు.