RGV : దిశా ఎన్కౌంటర్ పై ఆర్జీవీ సినిమా ట్రైలర్ విడుదల

2019లో జరిగిన దిశా ఎన్కౌంటర్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇలాంటి సంఘటనలని సినిమాలుగా తీయడానికి ఆర్జీవీ ముందుంటాడు. ఈ ఘటన జరిగిన తర్వాత దీనిపై సినిమాని ప్రకటించాడు ఆర్జీవీ.

RGV : దిశా ఎన్కౌంటర్ పై ఆర్జీవీ సినిమా ట్రైలర్ విడుదల

Asha Encounter

RGV : 2019లో జరిగిన దిశా ఎన్కౌంటర్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 2019 నవంబర్ లో రాత్రిపూట వెహికల్ పాడవటంతో హెల్ప్ కోసం చూస్తున్న ఓ యువతిని నలుగురు రేప్ చేసి చంపేశారు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. ఆ సంఘటనపై పోలీసులు చర్యలు తీసుకోవాలంటూ ధర్నాలు, ర్యాలీలు చేశారు. ఆ అమ్మాయికి న్యాయం జరగాలి అంటూ జనాలు రోడ్డెక్కారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ఆ ఆ నలుగురిని పట్టుకున్నారు. వారిని చంపేయాలంటూ జనాలు ఆగ్రహావేశాలు వ్యక్తపరిచారు. అయితే వారు పోలీస్ కస్టడీ లో ఉన్నప్పుడు ఒక చోట నుంచి ఇంకో చోటికి తరలిస్తుండగా పారిపోతున్నారని పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. ఈ ఎన్కౌంటర్ పై దేశవ్యాప్తంగా చర్చ జరిగింది.

Director Maruthi : ఇండస్ట్రీలో వాడుకొని వదిలేస్తారు.. కాని : మారుతి

ఇలాంటి సంఘటనలని సినిమాలుగా తీయడానికి ఆర్జీవీ ముందుంటాడు. ఈ ఘటన జరిగిన తర్వాత దీనిపై సినిమాని ప్రకటించాడు ఆర్జీవీ. దీనికోసం ఆ హంతకుల కుటుంబాలతో కూడా మాట్లాడాడు ఆర్జీవీ. కరోనా సమయంలో ఈ సినిమా షూటింగ్ ని పూర్తి చేశారు. ఇటీవల ఈ సినిమాని నవంబర్ 26న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసారు. ‘ఆశ ఎన్కౌంటర్’ అనే టైటిల్ తో ఈ కథ రాబోతుంది. వాస్తవంగా ఏం జరిగిందో కథలో కూడా అదే చూపించారని తెలుస్తుంది ట్రైలర్ చూస్తే. కాని ఆర్జీవీ గురించి తెలిసిందేగా అందుకే ట్రైలర్ ఆరంభంలో ఈ కథ ఎవర్ని ఉద్దేశించింది కాదు అని వేయడం గమనార్హం. ప్రస్తుతం ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో, యూట్యూబ్ లో వైరల్ అవుతుంది