RGV : కాకినాడ కోడిపందాల్లో ఆర్జీవీ.. వైసీపీ ఎమ్మెల్యే ఇంట్లో మకాం..

దర్శకుడు ఆర్జీవీ ఇటీవల తన సోషల్ మీడియాలో సంక్రాంతికి సంబంధించిన ఓ ఫోటో షేర్ చేసి.. నా జీవితంలో మొట్ట మొదటి సారి ఆంధ్రాలో పబ్లిక్ గా ప్రజలతో సంక్రాంతి సంబరాలలో పాల్గొనబోతున్నాను. దీని వెనుక ఎటువంటి రాజకీయ దురుద్దేశం..............

RGV : కాకినాడ కోడిపందాల్లో ఆర్జీవీ.. వైసీపీ ఎమ్మెల్యే ఇంట్లో మకాం..

RGV participated in sankranthi celebrations at kakinada

RGV :  తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా చేసుకుంటున్నారు. ఇక సంక్రాంతి వస్తే గోదావరి జిల్లాల్లో ఉండే కోడిపందాలు షరా మామూలే. ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఈ కోడిపందాలలో పాల్గొంటారు. మన సినిమా సెలబ్రిటీలు సైతం పండగకి తెలుగు రాష్ట్రాల్లోని సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటారు. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు వారి వారి సొంతూళ్లలో సంక్రాంతి సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు.

దర్శకుడు ఆర్జీవీ ఇటీవల తన సోషల్ మీడియాలో సంక్రాంతికి సంబంధించిన ఓ ఫోటో షేర్ చేసి.. నా జీవితంలో మొట్ట మొదటి సారి ఆంధ్రాలో పబ్లిక్ గా ప్రజలతో సంక్రాంతి సంబరాలలో పాల్గొనబోతున్నాను. దీని వెనుక ఎటువంటి రాజకీయ దురుద్దేశం లేదని నన్ను ద్వేషించే పార్టీ మీద ఒట్టేసి చెప్తున్నాను అంటూ పోస్ట్ చేశారు. తాజాగా ఆర్జీవీ సంక్రాంతి నాడు కాకినాడలో కనపడ్డారు.

Mamta Mohandas : ఇప్పటికే రెండు వ్యాధులతో పోరాటం.. మళ్ళీ మరో వ్యాధితో పోరాడుతున్న హీరోయిన్..

కాకినాడలో సంక్రాంతి సంబరాల్లో ఆర్జీవీ పాల్గొన్నారు. కోడిపందాల్లో కూడా పాల్గొన్నారు. అలాగే కోడిపందాల్లో గెలిచిన విజేతలకు బహుమతులు కూడా అందించారు. ఆర్జీవితో పాటు నటుడు కృష్ణుడు కూడా విచ్చేశారు. కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమాల్లో ఆర్జీవీ పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి ఇంట్లోనే బస చేసినట్టు సమాచారం. ఆర్జీవీ మరోసారి వైసీపీ ఎమ్మెల్యేతో తిరగడం చర్చగా మారింది.