Kondaa Murali : ‘కొండా 2’ కూడా ఉంటుంది : RGV

ఆర్జీవీ కొండా సినిమా ట్రైలర్ ఈవెంట్ లాంచ్ లో మాట్లాడుతూ... ''కొండా దంపతులు విప్లవ కారులు. నేను వాళ్లలా కాదు. విప్లవకారుడు అయ్యేంత ధైర్యం నాకు లేదు. ప్రత్యేక పరిస్థితుల్లో..........

Kondaa Murali : ‘కొండా 2’ కూడా ఉంటుంది : RGV

Kondaa Movie

RGV :  సెన్సేషన్ డైరెక్టర్ ఆర్జీవీ ఇటీవల తెలంగాణ నాయకుడు కొండా మురళి బయోపిక్ ని అనౌన్స్ చేశాడు. దీంతో తెలంగాణ రాజకీయాల్లో ఈ సినిమా ఆసక్తిగా మారింది. గతంలో ఆర్జీవీ ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. ”నేను మాఫియా, ఫ్యాక్షనిజం, రౌడీయిజంపై సినిమాలు తీసాను కానీ తెలంగాణ నక్సలైట్, మావోయిస్టుల గురించి తీయలేదు. ఇప్పుడు కొండా మురళి బయోపిక్ తో అది కూడా పూర్తవుతుంది” అని తెలిపారు. కొండా మురళి, కొండా సురేఖల నేపథ్యంలోంచి తెలంగాణ రాజకీయాలని, సాయుధ పోరాటాలని ”కొండా” సినిమాలో తెరకెక్కించారు.

జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా ‘కొండా’ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ లో కొండా మురళి రాజకీయ నాయకుడిగా ఎలా ఎదిగాడు? సురేఖతో ప్రేమ? సురేఖ కొండా మురళికి ఎలా సపోర్ట్ చేసింది? కొండా మురళి మీద జరిగిన హత్యాయత్నం, నక్సలైట్ల నేపథ్యం… ఇలాంటి అంశాలన్నీ చూపించినట్లు తెలుస్తుంది. ఈ ట్రైలర్ కి సంబంధించిన ఈవెంట్ వరంగల్ లో జరిగింది. ఈ ఈవెంట్ లో ఆర్జీవీతో పాటు కొండా దంపతులు పాల్గొన్నారు.

Nirupam Paritala : గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో డాక్టర్ బాబు

ఆర్జీవీ కొండా సినిమా ట్రైలర్ ఈవెంట్ లాంచ్ లో మాట్లాడుతూ… ”కొండా దంపతులు విప్లవ కారులు. నేను వాళ్లలా కాదు. విప్లవకారుడు అయ్యేంత ధైర్యం నాకు లేదు. ప్రత్యేక పరిస్థితుల్లో కొంత మంది వ్యక్తులు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాల నుంచి వాళ్ల జీవితాలు రకరకాల మలుపులు తిరిగి ఓ ప్రత్యేకతని సంతరించుకుంటాయి. ఆ ప్రత్యేకత ఎంతో మంది మీద ప్రభావం చూపిస్తుంది. ఇదొక వయలెంట్ క్రైమ్ డ్రామా అయినా ఇందులో స్ట్రాంగ్ లవ్ స్టోరీ ఉంది. మురళీ జీవితం మీద ఐదారు సినిమాలు తీయొచ్చు.

RGV : నాకు 50 వేలు ఇవ్వకుండా ఆర్జీవీ మోసం చేశారు : మహేశ్వరి

త్వరలో ‘కొండా 2’ కూడా తీస్తాను. ‘కొండా 2’లో మురళీ సురేఖ దంపతుల కుమార్తె సుష్మిత పాత్ర వుంటుంది. ‘కొండా’ సినిమాలో ఓ టైమ్ పీరియడ్ గెటప్ తీసుకోవడం వల్ల ఆమె పాత్ర లేదు. మురళి అన్న చేసిన రిస్క్ వల్ల నా కెరీర్ లో డిఫరెంట్ సినిమా తీశానన్న నమ్మకం వుంది. మార్చిలో సినిమాని విడుదల చేస్తాను” అని వర్మ తెలిపారు.