RGV : రాజకీయాల్లో ఎంట్రీపై ఆర్జీవీ స్పందన..ప్రజలకు సేవ చేయాలనే కోరిక లేదు!

రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందా ? ప్రముఖ దర్శకుడు వర్మను ఓ విలేకరి అడిగారు...

RGV : రాజకీయాల్లో ఎంట్రీపై ఆర్జీవీ స్పందన..ప్రజలకు సేవ చేయాలనే కోరిక లేదు!

Rgv

Politics : రాజకీయాల్లోకి ప్రముఖ దర్శకుడు, ఎప్పుడూ వార్తల్లో నిలిచే రామ్ గోపాల్ వర్మ వస్తున్నారా ? ఆయనకు ఇందులో ఇంట్రెస్ట్ ఉందా ? అనే వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. వర్మ త్వరలోనే రాజకీయల్లోకి రాబోతున్నాడనే రూమర్లపై వర్మ స్పందించారు. తనకు రాజకీయాల్లోకి వచ్చే అవకాశమే లేదని కుండబద్ధలు కొట్టాడు. ప్రజలకు సేవ చేయాలనే కోరిక లేదని తేటతెల్లం చేశాడు. ఓ ప్రముఖ తెలుగు వార్త చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

రాజకీయ నాయకులపై వర్మ తనదైన శైలిలో స్పందిస్తారనే సంగతి తెలిసిందే. స్థానికంగా ఉన్న లీడర్ నుంచి జాతీయ స్థాయిలో ఉన్న నేతలపై ఆయన సెటైర్స్ వేస్తుంటారు. ఒక్కొసారి ఇవి వివాదాస్పదమౌతుంటాయి. మరి రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందా ? అని విలేకరి ఓ ప్రశ్న సంధించాడు.

పాలిటిక్స్‌లోకి రావాలనే ఆలోచననే లేదని స్పష్టం చేశారాయన. ప్రజలకు సేవ చేసే ఉద్దేశం ఉన్నవాళ్లే రాజకీయాల్లోకి వస్తారని, తనకు ఆ సేవ చేసుకోవడానికి సమయం లేదని చెప్పడం గమనార్హం. ఇలా ఉన్నప్పుడు ప్రజలకు సేవ ఎలా చేస్తానని సూటిగా ప్రశ్నించారు. ఫేమ్, పవర్ కోసమే ఏ నేత అయినా..రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తుంటారని, ఈ విషయాన్ని పైకి చెప్పలేక…ప్రజా సేవ అంటూ..పైకి చెబుతుంటారని తనదైన శైలిలో స్పందించారు వర్మ.

Read More :కరోనాపై పోరు..ఢిల్లీలో ఆవు పిడకల ఫ్లాంట్ ఏర్పాటు చేయనున్న వీహెచ్ పీ