RGV: భుజం కొరికితే సినిమా తీయలేను.. కనీసం రెండు మర్డర్లైనా జరగాలి

తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (MAA) ఎన్నికలు ఈసారి సినీ ఇండస్ట్రీనే కాదు.. తెలుగు రాష్ట్రాల్లోనూ చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే. గతంలో..

RGV: భుజం కొరికితే సినిమా తీయలేను.. కనీసం రెండు మర్డర్లైనా జరగాలి

Rgv (1)

RGV: తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (MAA) ఎన్నికలు ఈసారి సినీ ఇండస్ట్రీనే కాదు.. తెలుగు రాష్ట్రాల్లోనూ చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే. గతంలో ఎన్నడూ లేని విధంగా మా ఎన్నికలు తీవ్ర ఉత్కంఠను రేపగా.. ఎన్నికలు పూర్తయినా ఇంకా మాటల దాడులు మాత్రం కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఈ ఎన్నికలపై ఎవరి వెర్షన్ ఎలా ఉన్నా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాత్రం ఈ ఎన్నికలు ఓ సర్కస్ అయితే.. అందులో పాల్గొన్న వారంతా జోకర్లని సంచలన కామెంట్స్ చేశారు. ఈ అంశంపై 10 టీవీ క్వశ్చన్ అవర్ లో మరోసారి హాట్ కామెంట్స్ చేశారు.

RGV: శ్రీరెడ్డి చీరవిప్పి రోడ్డెక్కినపుడే తెలిసింది.. ‘మా’ అనేది ఉందని!

మా అసోసియేషన్ అనేదే ఓ నాన్సెన్స్ వ్యవహారంగా పేర్కొన్న వర్మ.. ఆ ఎన్నికల కోసం కన్నీళ్లు పెట్టుకోడం.. భుజాలు కొరుక్కోడం అనేది ఇంకా పెద్ద డ్రామాలన్నారు. అయితే.. మా అసోసియేషన్ వ్యవహారంపైనా సినిమా చేస్తారా అన్న ప్రశ్నకు వర్మ సెటైరికల్ ఆన్సర్ చేశారు. తనకి మినిమమ్ రెండు మూడు మర్డర్లు ఉంటేనే.. సినిమా చేస్తానని.. ఇలా భుజాలు కొరుక్కోడం.. జుట్టు పీక్కోవడంపై సినిమా చేయడం వేస్ట్ అన్నారు. ఒకవేళ అలా మర్డర్లు జరిగితే తప్పకుండ చేస్తానన్నారు.

RGV: ఆరు వందల ఓట్ల కోసం జీరోలైన హీరోలు.. మాపై వర్మ!

మా ఎన్నికల సమయంలో నటి హేమా శివబాలాజీ భుజం కొరకడంపై వర్మ ఈ సెటైర్లు వేశారు. కొరకడం వలన ఎన్ని గాట్లు పడ్డాయో నాకు తెలియదు కానీ.. మీడియా కెమెరాలను చూసే మా వాళ్ళు ఇంతటి యాక్టింగ్ చేశారని మాత్రం చెప్తానన్నారు. అమెరికా ఎన్నికలను మించి మా ఎన్నికలు జరగడం ఏంటో అసలు విచిత్రంగా తనకు తోచిందని.. ఎంత ఆలోచించినా ఈ ఎన్నికలు ఎందుకింత భారీ హైప్ తెచ్చారో నా బుర్రకి అర్ధం కావడం లేదని వర్మ చెప్పారు.